ఆత్మీయతకు దర్పణాలు

ఆత్మీయతకు దర్పణాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయజుల ప్రసాద్

బాల్యంలో తల్లితండ్రుల,
కుటుంబ సభ్యులతో ప్రేమానుబంధాలు.
విద్యార్థి దశలో స్నేహితులతో స్నేహానుబంధాలు
దాంపత్య జీవితాన అలుమగల మధ్య మధురాను బంధాలు
పిల్లల ఆటపాటలతో
వారు మనకంటే ఉన్నత స్థితికి చేరినపుడు
ఆదరణతో పలకరించి మనల్ని అభిమానముగా చూసుకున్న ప్రేమబంధాలు
కుల మత భేధాలు లేని
పేద గొప్ప అని భావించని
కృష్ణ కుచేల బంధం
రామ సుగ్రీవుల అనుబంధం
రామ లక్ష్మణుల అన్నదముల అనుబంధం
సీతారాముల భార్యా భర్తల అనురాగ బంధం ఎన్నో ఎన్నెన్నో చక్కటి బంధాలు అనుబంధాలు
నేటి సమాజంలో మనిషి స్వార్థంతో, సంకుచిత మనస్తత్వంతో అంతా నేనే
అన్నీ నావే అనే అహంతో
ధనమూలమిదం జగత్ అన్నదే ధ్యేయంగా పెనవేసుకొన్న బంధాలే
కనుతెరిస్తే జననం
కనుమూస్తే మరణం
లిప్తపాటు జీవితకాలం అని
కరోనా నేర్పిన గుణపాఠాలద్వారా తెలిసికొని
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
అన్నదమ్ముల వలె దేశస్థులంతా మెలగవలెనోయ్ అని మహాకవి గురజాడ వారి అడుగు జాడల్లో పయనించి  బంధాలు అనుబంధాలు ఆత్మీయతకు దర్పణాలు అని తెలియచేద్దాం..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!