చిత్రమైన ఓ విచిత్ర కవిత

చిత్రమైన ఓ విచిత్ర కవిత
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

నే చూశా చిత్రమైన విచిత్రమైన ఓ చిత్రం
ఈ విచిత్ర ప్రపంచంలో ఇదో విచిత్ర చిత్రం
ఈ చిత్రాన్ని చూసి విచిత్రం పడొద్దు విచిత్రంగా అనుకున్నా
ఈ చిత్రంతో చిత్రమైన చిత్రకవిత రాయొచ్చు

చిత్రమైన ఈ జగతిలో ఏదైనా చిత్రమే
ఈ విచిత్ర జగతిలో ఏదైనా విచిత్రమే
ఈ చిత్ర విచిత్ర జగతిలో ప్రతీది చిత్ర విచిత్రమే
అందుకే చిత్రమైన చిత్రనికి చిత్రమైన కవిత రాయాలి

ఈ పోటీ ప్రపంచంలో విజ్ఞానాన్ని
చిత్రమైన ఆలోచనలతో నింపేస్తున్నారు
ఎవ్వరూ ఏది చిత్రమైన విచిత్రమైన
ఆస్వాదించక తప్పదు
వెర్రి వేయి విధాలుగా జగతి ముందుకు వెళ్తుంది

అందుకే ఏ చిత్రాన్ని తక్కువగా అంచనా వేయొద్దు
కాదేదీ ఏచిత్రం కవితకనర్హం
కోటీ చిత్రాలు కవిత కొరకే
కవితలన్నీ చిత్ర విచిత్రాలే

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!