వసంత రాగం

వసంత రాగం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

లేలేత చెట్ల చిగుర్ల నడుమ
కోయిల కూసే కుహూ గానమా
నల్లని మేఘాల చాటున చూడుమ
ముత్యాన్ని తలపించే చినుకుల వర్షమా
మదిలో మెదలేను ఆ వసంత రాగమే
నెమలి నాట్యమే నేత్రాలకు ఆనందమా
తూనీగా కదలికలే ప్రకృతి సోయాగమా
రంగుల హరివిల్లును తలపించేనే ఈ అందము
ఇదంతా దేవుని సృష్టిలోని భాగమా
ఇదంతా నాకు నమ్మ శక్యమా
సృష్టి అందాలు తిలకించ రెండు కనులూ చాలవేమో
మదిలో దాగిన ప్రేమని సైతం సృష్టించిన బ్రహ్మ
ఆ మనసులో సృష్టించెను కదా ప్రళయము
ఆశలు పెంచుకుని, ఆపదలు తెచ్చుకునేదము
ఎవరికి ఎరుక ఈ సృష్టి రహస్యము
అందాన్ని సృష్టించి, పెంచును ఆనందము
ఆశలని తీర్చుకొనుటకు, ఆపదలను పొందెదము
పుట్టుట, గిట్టుటన్నవి  మనమెరుగము
అహం, అజ్ఞానం అనేవి పెంచుకుందుము
అందాల్ని చూడక, సాధించాలనే తపనతో అంధులమగుదుము

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!