మరణం అంచున

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

మరణం అంచున

రచయిత :: బండి చందు

రహదారుల వెంబడి శవాలు నడుస్తున్నాయి
కాదు కాదు పరుగెడుతున్నాయి
ఆడని ఊపిరి కోసం
అందని ఆక్సిజన్ కోసం
చస్తే శ్మశానాల కోసం
బ్రతికొస్తే ఆసుపత్రి పడకల కోసం
నిన్నటి నిజాలతో
రేపటి అబద్దాలతో
నేటి కష్టాల కొలిమిలో
యుద్ధం చేసే మానవాళికి
మరణం అంచులు స్వాగతమిస్తున్నాయి
కాలం కక్ష్య కట్టిందేమో
శిక్ష వేయడానికి సిద్ధంగా ఉంది
మానవత్వం మంటకలిసి
మోసం తెరలు తీసి
జాలి లేని కరోనా
కాసుకు కూర్చుంది
మనిషి ప్రాణాలే లక్ష్యంగా…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!