కరోన ప్రేరణ కవిత 

కరోన ప్రేరణ కవిత 

రచయిత::నరసింహారావు కాసీమల్ల( అక్షరపద్మ ) 

మేలుకో….!
“భారతీయుడా”
మేలుకో…!

“జన జీవన స్రవంతిని సరైన మార్గాన నడుపుటకు నడుంకట్టి,
ఆవేశాన్ని పిడికిట బిగించి, మార్పుకోసం సమాజాన్ని చైతన్యం చేయి”…!

“పొరుగు దేశాల నీచమైన ఆకృత్యాలకు తల్లడిల్లుతున్న
నీ భరత జాతి సౌభాగ్యం కోసం జన జాతిని జాగృతం చేయి”….!!

” నీ శ్రేయస్సు కొరకు కంటికునుకు మరచి పోరాడే వైద్యులకు “,,,
” కాచి కాపాడే ఖాకీల పోరాటానికి ” తోడుగా   మేము సైతం అంటూ,
సమాజ శుద్దికి కంకణం కట్టిన  ” పారిశుధ్య కార్మికుల సేవ ” ను మరచి,,,
సొంత లాభముకై  ఏల…?
నీ పరుగు “….!!

” చీకటి తెరలను చీల్చి,,
సామాజిక దూరంతో స్వీయ నియంత్రణ పాటించు “….!
” కాదని ”
” కాలు బయట పేట్టినచో,
కరోన నీ చితికి కట్టెలు పేర్చునని మరువక,
దేశ ఐక్యతను ఏకతాటిపై నడిపేందుకు,
నడుంకట్టి,
నిజమైన భవితకు బాటలు వేయుటకు మేలుకోవోయ్ భారతీయుడా”….!!!
” మేలుకో “…!!!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!