నాకు చూడాలని ఉంది

నాకు చూడాలని ఉంది

రచయిత : ఎన్.ధనలక్ష్మీ

 

కల్మషంలేని  స్వచ్ఛమైన స్నేహన్నీ

చూడాలని ఉంది !!!!!

అందాన్ని కాకుండా మనసుని చూసి ప్రేమించే ప్రేమను  చూడాలని ఉంది !!!!

కులం ,మతం కాకుండా ప్రేమించే మనిషి వ్యక్తిత్వం చూసి  పెళ్లి  చేసే పెద్దలను చూడాలని ఉంది !!!

అమ్మయీ ,అబ్భాయి స్నేహాన్నీ తప్పుగ చూడని సమాజం  చూడాలని ఉంది !!!

వేసుకున్న దుస్తులను బట్టి అమ్మాయి  వ్యక్తిత్వాన్ని   తక్కువ చేయని  మనుషులను చూడాలని ఉంది !!

ఆస్తులు ,వస్తువులను  బట్టి కాకుండా మనుషులను చూసి ,ఆత్మీయతను పంచే బంధువులను చూడాలని ఉంది !!!

లంచము తీసుకోకుండా తమ కర్తవ్యాన్ని ,సమయపాలను పాటించి పని చేసే ఉద్యోగులను చూడాలని ఉంది !!!

అర్ధరాత్రియైన స్వేచ్ఛగా అమ్మాయి తిరిగిన  ఎటువంటి ప్రమాదాలు జరగని స్వేచ్చాయుత ప్రపపంచాన్ని చూడాలని ఉంది!!!

రిజర్వేషన్ లేని నా దేశన్నీ చూడాలని ఉంది

భారంకాని చదువులను  చూడాలని ఉంది !!

పిల్లలు స్వేచ్చగా తిరిగిన ప్రమాదం లేని లోకాన్ని చూడాలని ఉంది !!!

అవినీతిలేని రాజకీయా నాయకులను చూడాలని ఉంది !!!

మన సంస్కృతిని పాటించే యువతను చూడాలని ఉంది !!!

దేవుడిని భయంతో ,స్వార్థంతో కాకుండా భక్తిగా కొలిచే భక్తులను చూడాలని ఉంది !!!

వృధాశ్రమాలు ,అనాధ శరణాలు లేనటువంటి దేశాన్ని  చూడాలని ఉంది !!!

సెలబ్రిటీస్ విషయాలను కాకుండా మంచిని ప్రసారం చేసే టీవీలను,వార్తాపత్రికలను  చూడాలని ఉంది !!!

అప్పుల భారంతో తనువును వదులకుండా నేను ఉన్న నీకు అని రైతుకి భరోసాని, ధెర్యాన్ని  ఇచ్చే పార్టీలను  చూడాలని ఉంది !!!

అవినీతిలేని రాజకీయా నాయకులను చూడాలని ఉంది !!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!