దురధ్రృష్టవంతురాలు

దురధ్రృష్టవంతురాలు

రచన : యం.సుశీలా రమేష్


“ఆడపిల్లకు అణుకువ అందం.అహంకారం అలంకారం కాకూడదు.” నా పేరు శృతి, అక్క పేరు స్వాతి. అమ్మానాన్న ఇదే మా కుటుంబం.

అక్క ఎంఎస్సీ బి యెడ్ చేసింది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా చేస్తుంది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్  చదువుతున్నాను.

ఒకనాడు మా మేనత్త వచ్చింది మా ఇంటికి. తనకు మా చిన్ననాటి నుండి అక్కను తన కోడలుగా పంపాలని అన్నను అంటే మా నాన్న గారిని అడుగుతూ వుండేది. బావ పేరు సూర్య. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. మంచి అందగాడు తగిన ఆస్తిపాస్తులు ఒక్కడే సంతానం. అందరికీ తెలిసిన విషయమే కదా అని నాన్నగారు అక్కకు బావకు నిశ్చితార్థం ఏర్పాట్లు చేశారు.
మా బంధువులు అంతా వచ్చారు. ఏమైందో తెలియదు కానీ తాంబూలాలు మార్చుకునేటప్పుడు అక్క నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది.

ఎందుకు ఇష్టం లేదు అని అడిగితే బావ నాకన్నా తక్కువ చదువుకున్నాడు. అని ఒక్క కారణం చెప్పి వద్దంది. ఎంత మంది చెప్పినా వినలేదు. అందరిలో నన్ను తలదించుకునేలా చేశావు కదే అని, నేను చచ్చేంత వరకు నాతో మాట్లాడవద్దని అక్క మీద కేకలు వేశారు నాన్నగారు . పోనీ ఎవరినైనా ప్రేమించావా అడిగారు నాన్నగారు.

లేదు అని చెప్పింది అక్క.

ఇక నాన్న మా మేనత్త ను చెల్లాయ్ పెద్ద అమ్మాయి నీ కోడలు కావాలి అనుకుంటున్నావా అని అడిగారు.
నీ ఇష్టం అన్నయ్య నువ్వు ఏం చెప్తే అదే చేద్దాం అంటుంది అత్తయ్య.

బావ కూడా అమ్మ ఇష్టం మావయ్య అన్నాడు నాన్న అడిగితే.
అప్పుడు నాన్న నన్ను పిలిచి నీకు బావకు పెళ్లి నీకు ఇష్టమేనా అని అడిగారు. నాకు భయంతో ఏం చెప్పాలో తెలియక మీ ఇష్టం నాన్న అనేసాను.

నా ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత పెళ్లికి ముహూర్తం పెట్టారు. పెళ్లి చాలా బాగా జరిగింది. నేను పైకి కనపడను కానీ చాలా అల్లరి పిల్లను. ఎన్నోసార్లు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కానీ, ఇప్పుడు కోడలు హోదాలో నాకెందుకో భయంగా ఉంది మనసులో.

వ్రతం చేయించారు మా చేత , కానీ బావ చూపులు తేడాగా ఉన్నాయి నా బుర్ర ఎంత గోకిన నాకు అర్థం కాలేదు.

మిగతా చుట్టాలంతా అంటే మా ఆడగ్యాంగ్ వాళ్ళ ముచ్చట్లు చెప్పుకుంటూ, నన్ను చూసి ఈరోజుతో దీని పని గోవిందా గోవిందా అంటుంటే, అర్థమయ్యేలా చెప్తారా నాకు, అని అడిగాను నేను , వరసకు నాకు వదిన తను వచ్చి నా చెవిలో చెప్పింది.

అప్పుడు అర్థమైంది ఉదయం బావ చూసిన చూపు కు అర్థం. ఏంటమ్మా షాక్ కొట్టిందా అని అడిగింది వదిన. గదిలోకి వెళ్లాక ఇంకా బోలెడు షాక్లు ఉంటాయి, అని చెప్పింది వదిన.

ఎందుకంటే బావను నేను ఎప్పుడూ కోతి బావ అని ఆటపట్టించే దాన్ని. కోతులు చెట్ల పైన ఉండాలి కానీ ఇంట్లో కాదు బావా అనేదాన్ని ఇప్పుడు బావ ముఖం చూడాలి అంటే నాకు సిగ్గేస్తుంది. చుట్టాలంతా సాయంత్రానికి వెళ్లిపోయారు.

నాన్న వాళ్ళు వెళ్దామంటే ఏంటి అన్నయ్య ఇది పరాయి వాళ్లలా అంటున్నారు. రేపు వెళ్దురుగాని అన్నది కొంచెం గట్టిగానే.

రాత్రికి కార్యానికి నన్ను రెడీ చేస్తుంటే. అమ్మ కార్యం కార్యం అంటున్నారు అంటే ఏంటమ్మా అని నేను అమ్మని అడిగాను, అంతే అక్కడున్న అమ్మ అత్తయ్య వదినలు మా పిన్ని వాళ్ళు అంతా కలిసి ఒకటేసారి పగలబడి నవ్వారు.

కార్యం అంటే ఏంటో గది లోకి వెళ్లి మీ బావను అడుగు అని అందరూ ఆటపట్టించారు నన్ను.
అడుగుతాను నాకేమన్న భయమా అన్నాను పెద్ద రోషంగా నేను.

గదిలోకి వెళ్లే ముందు అంతా బావ మనసు తెలుసుకుని మసలుకోవాలి అంటున్నారు అంటే ఏంటో నాకు తెలియదు.

పాలగ్లాసుతో నేను గదిలో అడుగుపెట్టగానే బయటనుండి తలుపు మూసి గడియ పెట్టేసారు.
గదిలో అడుగు పెట్టిన నాకు మాట పడిపోయింది భయంతో.

బావా చిరునవ్వు నవ్వి గ్లాసు తీసుకుని. ఏంటి కోతులు ఎక్కడుంటాయి అడిగాడు,

నా గొంతులో నుండి మాట వస్తే కదా, చెమటలు విపరీతంగా పట్టేశాయి.

ఏంటో తెగ సిగ్గుపడే పోతున్నాను నాకే అర్థం కావడం లేదు నా పరిస్థితి. నేనంటే ఇష్టమేనా అని అడిగాడు బావ , అవును అన్నట్టు తల ఊపాను. బావా నా చేతిని పట్టుకుని దగ్గరకు లాగేసరికి నేను వెళ్లి బావ మీద పడ్డాను.

అప్పుడు బావ నిన్ను చెక్కిన బ్రహ్మకు ఏమిచ్చినా తక్కువే అంటున్నాడు, బావ ఉచ్ఛ్వాస నాలో గిలిగింతలు రేపుతుంటే బావ చేతిలో ఏమో నన్ను ఆపాదమస్తకం తడుముతుంటే నేను నాకు తెలియకుండానే బావను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాను.

ముద్దు అక్కడ కాదు మొద్దు ఇక్కడ పెట్టాలంటూ నా పెదవులను అందుకున్నాడు బావ. అంతే నాకైతే ఇంకేమీ గుర్తులేదు బావ మైకంలో పడి పోయాను.

మాకు పెళ్లి జరిగి ఇప్పటికీ పదేళ్లు.
ఇద్దరు పిల్లలు. ఈ పదేళ్ళలో బావ నన్ను ఒక్క రోజు కూడా పల్లెత్తు మాట అనలేదు. నిజంగా బావ లాంటి భర్త దొరకడం ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలం.

అక్క ఇప్పటికీ అలాగే ఉంది పెళ్లి చేసుకోలేదు కారణం అహంకారం. నాన్నకు తనకు మాటల్లేవు. ఎంత చదువుకున్నా, దేశానికి ప్రధానమంత్రి అయినా భర్తకు భార్య అనిపించుకోవడం లోనే ఆడదానికి విలువ ఉంటుంది. ఆడదానికి అణకువ ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు.

” ఎప్పుడైతే ఆడది అహంకారాన్ని తన ఆభరణంగా ధరిస్తుందో అప్పుడు ఆమె దురదృష్టవంతురాలు.” అని నేను రూఢి గా చెప్పగలను.

సమాప్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!