తప్పారు అంటే…తప్పరూ మరి!
రచన: వాడపర్తి వెంకటరమణ
వాళ్ళబ్బాయి పరీక్ష తప్పాడు
తప్పాడు అంటే…తప్పడూ మరి!
చదువుకోవాల్సిన సమయంలో
అర్థరాత్రి అపరాత్రి అని తేడాలేక
అనునిత్యం అంతర్జాలంలో
ఆన్ లైన్ గేములాడుతుంటేనూ!!
వాళ్ళమ్మాయి నెల తప్పింది
తప్పింది అంటే…తప్పదూ మరి!
పార్కుల్లోనూ కనపడిన పబ్బుల్లోనూ
చెడు సావాసాలకు గ్రీన్ సిగ్నలిచ్చి
స్వాగత తోరణాలు కడుతుంటేనూ!!
వాళ్ళావిడ బస్సు తప్పింది
తప్పింది అంటే…తప్పదూ మరి!
ప్రయాణానికి బయలుదేరాల్సిన వేళ
కోడల్ని అత్తెలా రాచిరంపానపెడుతుందోనని
సీరియస్ గా సీరియల్ చూట్టంంలో
లీనమై తరించిపోతేనూ!!
అతనికెప్పుడో మతి తప్పింది
తప్పింది అంటే… తప్పదూ మరి!
సంసార సాగరంలో ఈదులాడి
ధరలతో అనునిత్యం యుద్ధంచేస్తూ
ఖర్చుల భారాన్ని భుజానమోస్తున్నందుకు!!