నవలోకం

నవలోకం

రచయిత :: చంద్రకళ. దీకొండ

అదిగో నవలోకం…
పిలుస్తోంది రారమ్మంటూ…!
అల్లన మెలమెల్లన సాగే
నీలిమేఘ మాలికలు…
నిర్మలంగా ప్రవహించే
సెలయేటి గలగలలు…
చల్లగ మేనిని తాకే
మలయమారుత సరిగమలు…!
నాసికాపుటములకు సోకే
పూలగంధాల
ఘుమఘుమలు…
శ్రవణానందకరమైన శుకపికముల కలరవములు…
ఎటు చూసినా హరితవర్ణంతో
కనువిందు చేసే తరువులు…!
తెలియని హాయిని కలిగించే…
మధుర భావ సుమాలను పూయించే…
ఈ ప్రకృతి సౌందర్యం…
మనసుకు కలిగించే సాంత్వనం…!
మధువనిలో విరిసిన
పూల ఊయల…
ఊరించే ఊహాలలో ఓలలాడిస్తూ…
కాలమిలా ఆగిపోనీ అనే
కోరికను కలిగిస్తూ…
ఇక్కడే ఇలాగే ఉండిపోనీ
అనిపించే ఆనందాన్ని
స్వంతం చేస్తూ…!
అదిగో నవలోకం…
పిలుస్తోంది రారమ్మంటూ…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!