నిశీధి జాములో

అంశం: నిశి రాతిరి

నిశీధి జాములో
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఉమామహేశ్వరి యాళ్ళ

జాము రాతిరిలో జాబిలి కానక
అమవాస నిశీధి కబళించగా
దట్టంగా అలుముకున్న మేఘాలు
రాకాసి కేకలు వేస్తుండగా పడిందో పిడుగు
నా హృదయము దద్దరిల్లగ దిగినదో ఆకారం
దివి నుండి భువికి వేంచేసినా  ఆ ప్రియతముడు

భయమొద్దని ధైర్యం పంచగ కౌగిలి తోడిచ్చిన నా సఖుడు
వరాల మాలగా నా ఒడిలో దాగిన నా మనోహరుడు
ఆ చీకట్లను దాటుకుని మనఃపంజరంలో నాకై
వేల ప్రేమ జ్యోతులు వెలిగించిన సుందరాంగుడు

నిశీధి అంటే భయపడవలదని ఎన్నో తీపి గురుతులకది అవకాశమని తెలిపి
నను నా కలల లోకానికి రాణిని చేసిన యువరాజు
నా మనసను చీకట్లలో దాగిన ఆ నెలరాజు
పక్షాలేర్పడని నాదు పున్నమి రేడు
జన్మజన్మాలకు కాంక్షించే నా తోడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!