ఏమిటో ఈ లోకం.

ఏమిటో ఈ లోకం...

-జీ వీ నాయుడు

నిజాయితీ పరులకు
ప్రేమికులు కరువు
నటనా పరులకు
క్యూలో పలువురు

అబద్దాలకు అందలం
నిజాలకు మంగళం
ఆకర్షణకు వందనం
నిబద్దతకు నిరాకరం

యధార్థం విరోధం
భూటకం ప్రసన్నం
పొగడ్తలకు దాసోహం
విమర్శలకు పాతాళం

సోకులకు స్వాగతం
సహజాలకు సున్నం
నకిలీలకు నజరాన
నిజాయతీకీ తిరస్కరణ

ఇది లోకం తీరు
తీరు మరునా
వాస్తవం గెలిచేనా
సఫలం చేకూరేనా….!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!