వృక్ష విలాపం

వృక్ష విలాపం

-అయ్యలసోమయాజుల ప్రసాద్

నీవు విడచిన చెడుగాలిని స్వీకరించి బదులుగా నీ జీవితానికి ఆధారమైన ప్రాణవవాయువు ను నిరంతరం నీకు అందిస్తు
నీ నివాసానికి, ఇంట్లో కూర్చునే పీట నుంచి
సుఖనిద్ర పోవడానికి మంచం వరకు మా శరీరం నుచి ప్రతిఫలాపేక్ష లేక
“పరోపకారార్ధం ఇదం శరీరం” అన్నది ఆశయంగా
అన్ని విధాలా సహాయం చేస్తున్న మా పై కనికరం లేక కసాయి గా మారుతున్న మనిషి
తెలుసుకో నీ వినాశననికి నీవే కారణం……!!

నేటి సునామీలు,భూతాపాలకి కారణం, విచక్షణారహితంగా పచ్చటి మా జీవితాలను నాశనం చేసి స్వార్థంతో ,అత్యాశతో నీవు నిర్మిస్తున్న కాంక్రీట్ వనాలే అని తెలుసుకుని
” వృక్షో రక్షతి రక్షితః” అన్న
మహనీయులు చిప్కో ఉద్యమ నేతలు బహుగుణ, మేధాపాట్కర్
అడుగు జాడల్లో నడచి మమ్మల్ని రక్షించి,
ప్రకృతి పరిరక్షణ కు తోడ్పడి ఆదర్శజీవనం
సమాజాభి వృద్ధికి ప్రతీకలు అని వసుదైవ కుటుంబానికి తెలియచేయి మానవా..!!
…………………………..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!