సెగ కమ్మిన నిశి!

అంశం: నిశి రాతిరి

సెగ కమ్మిన నిశి!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత.పి.వి.ఎల్

సెగల పొగలు
కమ్మేస్తోన్నాయి..
శిధిలమైన ఙ్ఞాపకాలని
కడిగేస్తూ..!
సాయం కోరలేని
సైకత తీరంలో
ప్రాణం గిలార్చుకుపోతోంది..
కళ్ళకేదీ కనబడనట్టుగా
దట్టంగా మసకలు కమ్మేస్తోన్నాయి..
మదిలో ఇగిరిపోయిన
ప్రేమ తాలూకు చలమలు
తృషిత మృత్యు ఎడారిలో
తృటిలో ఇంకిపోతుంటే,
కళ్ళారా చూస్తూ కూడా
ఏమీ చెయ్యలేని
నిస్సహాయత స్ధితిలో
కనిపించని కరాన్ని చాస్తూ..
తెరవని మది తలుపులని
దీనంగా తడుతూ..
భయద సంశయ విపినంలో
శాశ్వత నిశిని చేరుకునేంత దట్టంగా రాతిరిని సైతం
కమ్మేస్తోన్నాయి!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!