దురదృష్టానికి తోడైతే 

అంశం: నిశి రాతిరి

దురదృష్టానికి తోడైతే 
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత కోకిల

నిశి రాత్రిలో నిద్రించిన వేళ
ఏపుకు  వచ్చిన పంట చేతికి
వస్తుందని  ఎంతో ఆశతో
ఎదురు చూసే  రైతన్నలకు
నిరాశ ఎదురైతే  వారి పరిస్థితి
అయోమయ నిస్సహాయ పరిస్థితి
ఆకలి తీరక అప్పులు కట్టలేక
చావో బతుకో తేల్చుకోలేక నేలను
నమ్ముకున్న రైతన్నలు ఆత్మహత్యలు
చేసుకొని ఆ నెలలోనే ఒదిగిపోతున్న
రైతన్నలు ఇలా ఎంతోమంది నేలకు అంకితమైపోతున్నారు వీరిని
మనమంతా చేయూతనిచ్చి
మన పంటను మనమే పండించు
కొనేలా  చేసుకొని  అన్నదాతలమై
అందరి కడుపులు నిండేలా చేసి
అన్నదాతల రుణాలను తీర్చుకుని
మన భారతావనిని కాపాడుకున్నట్లుగానే
మనమందరమూ రైతన్నలను కాపాడుకుందాం
ఇదే మన భారత సాంప్రదాయక వెన్నుముక
ఇది మన అందరిలో ఉండాలి
మనం అశాంతికి  తావివ్వకుండా
అదే మనమందరమూ ఒక్కటై
శాంతియుతంగా పరిష్కరించుకొని
మన రైతన్నలను మనం  కాపాడుకుందాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!