భారతీయులం మేము

భారతీయులం మేము

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

అన్ని జాతి, మతాలు కలిసే కూడలిరా మాది,

మానవత్వం, హితవాదం మాకు ఆభరణంరా,
భారతీయులం మేము, భారతజాతీ మాది;

మతతత్వమే జన హింస  అయితే, గియితే
మతం వద్దు, గితం వద్దు, మారణహోమం వద్దు,
భారతీయులం మేము, భారతజాతీ మాది;

మా జాతీయ పతాకం మాకు గర్వకారణం,
మతానికి ముడిపెట్టే పిడివాదం కాదురా,
భారతీయులం మేము, భారతజాతీ మాది;

మతానికి మూల్యం కట్టే భారతీయం కాదురా,
వేరు మతానికి విలువ కట్టి, చేరేవిధం లేదురా,
భారతీయులం మేము, భారతజాతీ మాది;

అహింసా మార్గానికి బుద్దుని వారసులం,
అన్యాయం జరిగితే నేతాజీ అనుసరులం,
భారతీయులం మేము, భారతజాతీ మాది;

(నాకు తెలిసి భారత దేశంలో మతము, కులము అనేవి లేవు. హిందూత్వం అనేది ఒక జీవన విధానం, విదేశీయులు మత ముద్ర వేసి హిందూమతం చేసారు. పూర్వం అందరూ తమకు తోచిన, వచ్చిన విద్య లేదా వృత్తిలో జీవనం సాగించేవారు. స్వార్థపూరిత ఆలోచనలతో ఆ వృత్తిలే కులాలుగా మార్పులు, చేర్పులు జరిగాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!