అనుక్షణం అమ్మ స్మృతులే

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

అనుక్షణం అమ్మ స్మృతులే
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కె.గీతాశైలజ

భూమిపైకి నన్ను తీసుకొచ్చిన నాటినుండి
అనుక్షణం కనిపెట్టుకొనే ఉన్నావు నీడలా అండవై
నేడు నీవు లేవన్నది నిజం నమ్మకం లేనిమనసు
ఆరుబయటట వెన్నెల్లో కూర్చుని
కంటున్న కలలలో
నీజ్ఞాపకాలతారలను ఒక్కొక్కటీ పేర్చుకుంటూ
కుప్పబోసుకుంటున్న వైనం
కొబ్బరాకుల నీడల్లో ఆరుబయట నులకమంచం
పై నీవు చెప్పే నక్షత్రాలు గురించి అవలోకనం చేసుకుంటూ
చంద్రుని చుట్టూ కట్టినగూడు వరదగుడిని చూస్తూ నిదరబోయిన రోజులు
గోరుముద్దలు తినిపిస్తూ ఆడిన దాగుడుమూతల స్మృతులు
ఒక్కొక్కటిగా కూర్చుకొని పెనవేసుకుంటున్నా
గీతచదివే నీతోడులేని సింహద్వారం వెలవెలబోతుంటే
కళ్ళలో నిండిన నీటితో అస్పష్టమైన నీరూపం కనబడనంటుంటే
బరువెక్కిన హృదయాంతరంగాన జ్ఞాపకాల నిశ్శబ్దం నిరవనిశీధిని తలపిస్తోంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!