నోములు ఉద్యాపన

నోములు ఉద్యాపన

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

రాఘవరావు, సీతాలక్ష్మి లది ఆదర్శదాంపత్యం. పాతికేళ్ళు వారి సంసారం ఆనందతరంగితమే. ముత్యాల్లాంటి ఇద్దరు కొడుకులు శ్రీధర్, శ్రీరామ్ లు. చక్కగా చదువుకొని ఉన్నతోద్యోగులయ్యారు. పెళ్ళిళ్ళు కూడా ఆయ్యి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. రాఘవరావు విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. పెన్షనుతో బాగానే గడచిపోతుంది. అన్నీ సదుపాయాలు సమకూర్చుకున్నారు.

ఒకరోజు ఏమైందంటే.. సీతాలక్ష్మీ అత్తగారు వాళ్ళ చిన్నబ్బాయి దగ్గర్నుండి హఠాత్తుగా
ఊడిపడింది. ఆవిడకీ ఇద్దరు కోడుకులే, చిన్నకోడుకింకా
ఉద్యోగం చేస్తున్నాడు. ఆరేసినెల్లు ఆవిడ వంతులేర్పాటు చేసుకున్నట్టు ఇద్దరుకోడుకుల దగ్గర
గడుపుతుంటుంది. ఆవిడ భర్తపోయిందగ్గర్నుంచి ఇదే
తంతు. కోడల్లకి ఏ పూజలు నోములు చేయాలో
అవి ఎప్పుడెప్పుడు ఉద్యాపన చెయ్యాలో గుర్తు చేస్తూ వాళ్ళ చేత అవి పూర్తి చేయిస్తుంటుంది.

ఈ రోజుల్లో కూడా అవెవరూ చేస్తున్నారంటే వినిపించుకోరు. పట్టు పట్టి చేయిస్తుంది ఇప్పుడు అదే పనిమీద పెద్దకోడలు దగ్గరకి వచ్చింది. “అమ్మాయి సీతా! నీకు గుర్తుందోలేదో గాని నువ్వు మూడు నోములు ఉద్యాపన చెయ్యాలమ్మా. నాగపంచమి, కార్తీకదీపదానం, మంగళగౌరి వ్రతం గుర్తున్నాయా? ఇప్పుడు నువ్వు తీరూబాటుగానే ఉన్నావు కదా. అవి పూర్తి చేసేసుకో. ఏమంటావు? ఏదో నేనుండగా నాకళ్ళముందే జరీగితే అదో తృప్తి నాకు.”

“సరేలెండి అత్తయ్యా! ఏం చెయ్యాలో చెబుతే చేస్తాను.
మీ మాట ఎందుకు కాదంటాను చెప్పండి” సీతాలక్ష్మి
జవాబు. “అలాగన్నావు బాగుంది. మొదటి రెండూ ఈ కార్తీకమాసంలోనే చేసేసుకో. ఆ మంగళగౌరి వ్రతంది
మాత్రం ఆ చిన్నాడి కుతురి పెళ్ళికో లేకపోతే మీ చిన్నతమ్ముడు కూతురి పెళ్ళికో పూర్తిచేసేసుకోవచ్చు ఏమంటావు” సలహ ఇచ్చింది అత్తగారు.

“ముందుగా నాగపంచమి ఉద్యాపన మీ పెద్ధ తమ్ముడి
కిచ్చేసి, కార్తీకదీపదానం మీ చిన్న తమ్ముడికిచ్చేసి
ఉద్యాపన చేసేసుకోమ్మా. నాగపంచమి ఉద్యాపన ఒక కుంచెడు స, బంగారపు నాగరూప ఉంగరం, తియ్యగుమ్మడి
పండు, ఒకవెదురు బుట్టలో దంపతులిరువురికి కొత్తబట్టలు పెట్టి నోము ఉద్యాపన చేసేసుకో. కార్తీకపౌర్ణమినాడు మీ చిన్నతమ్ముడు మరదలకి భొజనం పెట్టి కొత్తబట్టలు వెండి దీపపుకుందుతో ఆ నోము కూడా ఉద్యాపన చేసేసుకో. సరేనా!” అత్తగారు సలహ. “అలాగేనండి.”సీతాలక్ష్మీ జవాబిచ్చింది.

ఇక వెంటనే కార్యాచరణకు దిగింది. ముందుగా కావల్సిన వస్తవుల జాబితా రాసుకుంది. ఇక భర్తగారితో బజారుకు బయలుదేరింది. ఇక అక్కడనుండి రాఘవరావుకు సహనపరీక్షే.
ఆయనెప్పుడూ భార్యతో కలసి బజారుకెళ్ళింది లేదు.
అన్నీ సీతాలక్ష్మే చూసుకునేది. ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నాడు గనుక తప్పించుకునే అవకాశం లేదు మరి.
బజారు చెంతాడంతా ఉంది. ఒకొక్క వస్తువు ఒక్కొచోట
తిరిగి తెచ్చుకోనేసరికి ఒక రోజంతా పట్టింది. తప్పదుగా మరి ఆలాగే అన్నీ సమకూర్చుకొని నోముల ఉద్యాపన పూర్తిచేసుకుంది సీతాలక్ష్మి. అత్తగారు సంతోషించారు. చిన్నకొడుకు కూతురి పెళ్ళికి తొందరచెయ్యాలని చిన్నకొడుకు దగ్గరికి మర్నాడే వెళ్ళిపోయారు అత్తగారు. వెళ్తూ సీతాలక్ష్మీ కి తమ చిన్నతమ్ముడి కూతురు పెళ్ళికి కూడా తొందరపెట్టమని మరీ చెప్పి వెళ్ళారు. పెద్దావిడమాట కాదనలేరుకదా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!