నా నీడవై

నా నీడవై

రచన: జయ

వేకువజామున తొలికిరణమై
నా హృదయా నికి స్పందనవై
వేసంగి ఎండలో హేమంతమై
సీతంగి మంచులో వెచ్చని కౌగిలివై
నీ అధరాలపైన స్థిరనివాసం ఉండే
తరలాక్షి నేనై
నీ కనులలోన వెలుగులు తెచ్చే వెన్నలనై
ఎదనదిలోన అలజడి నీవై
నిను నడిపే చుక్కాని నేనై
నీకు నేను భానిసై
నాకు నువ్వు బాసటై
నా వెన్నంటి ఉండే నీడవు నీవై
నీ ప్రతి అడుగులోనా తొడును నేనై
నాకు నువ్వు అనుబంధమై.
నీకు నేను బంధమై
జగాలను ఏలే శివపార్వతులమై
అర్ధనారేశ్వరులమై ..
ప్రేమకు ప్రతిరూపమై
రాధాకృష్ణ లమై..
నిలిచిపోయే ప్రేమ సమీదలం
నువ్వు-నేను
మన ప్రేమ.

నా స్వీయరచన అని హామీ ఇస్తున్నానను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!