ఆమె

ఆమె

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

మేడమ్, గుడ్ మార్నింగ్, అంటూ విష్ చేసాను.

వెరీ గుడ్ మార్నింగ్…. ఇవాళ నా ప్రొగ్రామ్ షీట్ రెడీ చేశారా? ఇవాళ ముఖ్యమైన పనులు ఏమున్నాయి? టైం షెడ్యూలు వేసారా? అని అడిగారు మా మేడమ్ శ్రీమతి నందితాచౌహాన్.

ఎస్ మేడమ్, అన్నీ రెడీ చేసాను. మీరు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో  డీల్ సెట్ చెయ్యాలి. ఫారెన్ కంపెనీ చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి.

ఇంకా మిమ్మల్ని ఈ రోజు అనాధ బాలల ఆశ్రమం ఓపెనింగ్ కి ఆహ్వానించారు. ఇవి ముఖ్యమైన పనులు మేడమ్ ఈ రోజుకు అని చెప్పాను.

ఓకే మిసెస్ సుధాకిరణ్, మీరు మొదటగా, వాళ్లతో వీడియో కాల్ ప్లాను చెయ్యండి. తర్వాత రియల్ ఎస్టేట్ మీటింగ్. చివరిగా ఆశ్రమం ఓపెనింగ్ చూసుకుందాము అన్నారు.

నేను కాల్ కలిపేలోగా మేడమ్ బయట వెయిట్ చేస్తున్న చిన్నకారు వ్యాపారుల సమస్యలను వింటున్నారు.

మేడమ్ ఆలోచన ప్రకారం, అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరిలో ఆ ఆశ్రమంలో మేడమ్ అక్కడి పిల్లలతో కలసి ఆడి, పాడి ఒక చిన్న పిల్లగా మారిపోయారు.

ఇంకా మీరు వెళ్లొచ్చు సుధా, మీరు కూడా మీ పాపతో ఆడుకొండి ఈ రోజుకి అని నవ్వారు. ఆ నవ్వులోని భాద, ఆ కళ్లలోని చిరు చెమ్మగా బయటపడింది.

ఆ భాద ప్రపంచానికి తెలియని భాద. నాకు మాత్రమే తెలిసిన ఆ భాద మేడమ్ ఇంకా ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు.

చూడగానే ఆకట్టుకునే చిరు జల్లు లాంటి చిరునవ్వు, ముత్యాలు లాంటి పలు వరస, సంపెంగ పువ్వు లాంటి ముక్కు, కలువ రేకులు లాంటి కన్నులు, తను నడుస్తూ వస్తుంటే ఒక లక్ష్మీదేవి నడిచి వచ్చినట్టే ఉండే హంస నడక.
అనవసర భేషజాలకు పోకుండా అందమైన చీర కట్టుతో మా మేడమ్ అలా వస్తూ ఉంటే, ఎంతటివారైనా లేచి నిలబడి నమస్కారం చెయ్యాల్సిందే మరి.

కోట్లకు పడగ ఎత్తిన కుటుంబం వారిది. ఒక్కతే అమ్మాయి. తల్లిదండ్రులు మేడమ్ చిన్న తనంలోనే చనిపోతే, వాళ్ళ మామయ్య మేడమ్ బాగోగులు చూసుకునేవారు.  ఎంత గొప్ప తెలివిగల వాళ్ళు అయినా, వయసు ప్రభావం ఉండకపోదు. అలా తను చేసిన ఒక పెద్ద తప్పే వాళ్ళ ప్రేమపెళ్లి.

ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు అనుకొంది. కానీ వాడు ప్రేమించినది తన ఆస్తిని. వాడు వాడుకున్నది తన అమాయకత్వాన్ని అని ఒక పాప పుట్టిన తర్వాత కానీ అర్దం   కాలేదు. అదీ మేడమ్ దురదృష్టం.

అలాగని విడాకులు లేవు, విడిపోవటం లేదు. ఒకే ఇంట్లో శత్రువుల వలే కాలం గడుపుతారు. వాడికే రోజుకో వ్యసనంతో హ్యాపీ గానే ఉంటాడు.

ఇలాంటి పరిస్థితుల్లో పాప ఇక్కడ వద్దు అనుకుంటూ, ఒక హాస్టల్ లో ఉంచింది. ఆ పాప వచ్చినప్పుడు మాత్రం,  అ ఇల్లు నందనవనమే.

అవును మరి అలా నటించక పోతే వాడికి అవసరానికి మా మేడమ్ డబ్బులు ఇవ్వదెమో అని భయం వాడికి. అందుకే, వాడు నటించ మంటే ఏకంగా జీవించెస్తాడు.

కానీ ఆ ఒక్క నిమిషం అనిపిస్తుంది రోజూ ఇలా ఉంటే, మా మేడమ్ జీవితం మోడువారేది కాదు కదా అని.

కానీ ఏం లాభం అన్నీ ఉండి కూడా నచ్చని వాటిని అన్నింటిని వదిలేసుకున్న మా మేడమ్ మనసు గొప్పతనం ఎవరికి అర్థమవుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!