ఙ్ఞాపకాలు

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

ఙ్ఞాపకాలు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

కొన్ని జ్ఞాపకాలు మదిని కలవర పెడతాయి
మరికొన్ని జ్ఞాపకాలు మనసును పులకింపచేస్తాయి
ఈ సమయం ఆగిపోదు ఎవరికోసమో
మనము నిమిత్త మాత్రులమే అని తెలుసుకో

జీవితమే కష్టసుఖాల కావడి అంటారే
నీ ఆశలే సుఖదుఃఖాలకు మూలం అంటారే
ఎన్నో రాతలు మరెన్నో గీతలు నీ నుదుటనే రాశారే
అవి పలక పై రాతలు కావు గత జీవితం తుడిపేయటానికి

మనసుకు గాయం చేసిన మాటలెన్నో
గుండెకు చిల్లు పడినట్టు పలికే పలుకులెన్నో
జీవనమే కష్టతరమైన రోజులెన్నో
నిరాశ, నిస్పృహలతో గడిపిన ఆ కాలం మరపు రాదేమో!!

నా రాత రాసిన దేవుడిని నిలదీయాలని ఉంది
నా తలరాతను మార్చేయాలని ఉంది
ఇవి సాగవని తెలసి, నన్ను నేను మార్చుకోవలసి ఉంది
విజయం వైపు పయనం మొదలుపెట్టాల్సి ఉంది…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!