నా తెల్ల వెంట్రుకలు

నా తెల్ల వెంట్రుకలు 

రచన::ముక్కా సత్యనారాయణ

తెల్ల వెంట్రుకలు నా ప్రియతమ నేస్తాలు
నా తెల్ల వెంట్రుకలు నాకు ప్రియతమం.
నా జీవితం కు మజిలి దరికి వచ్చిందని
నాకు తెలిపే నేస్తాలు.
బాధ్యతలు గుర్తు చేసే మార్గదర్శకాలు.
ప్రతి తెల్ల వెంట్రుక వెనుక ఓ అనుభవం..
ఎన్ని మజిలీలు దాటి వచ్చానో
చిన్న వయసులో.. గుర్తు తెచ్చుకుంటూ..
నాలో నేను గర్విస్తుంటాను.
అవమానాలు, ఆదరణ. ఆనందాలు అల్ప సంతోషాలు
ఛీత్కారాలు. గౌరవం. చిరు సత్కారాలు
పేదరికం, పెద్దరికం..
గడ్డం నిమురుకుంటూ మాటలాడుతుంటే
గడగడా అనుభూతులు తన్నుకొని వస్తాయి.
కలం ఎదురు తిరిగితే చాలు. ఆలోచన తో
గడ్డం పైకి చేయి వెళుతుంది, అవలోకనం
స్ఫూర్తి కోసం..
ఆర్తి గా కలం కదులుతుంది.
అద్దం లో తెల్ల వెంట్రుక చూసుకుంటే ఆనందం.
నేను పెద్దవాడినని,
ప్రేమగా నిమురుకుంటూ.. సవరదీసుకుంటూ
అన్నట్లు నా మనసుకు స్పీడ్ బ్రేకర్.
ఆలోచనా, అవలోకనా సమతుల్యం
నాపై నా చెర్నాకోల నా తెల్లవెంట్రుక.
నా గడ్డం తీయమని అడిగితే నాకెందుకో చిరాకు.
కొన్ని వదిలించుకునే ప్రక్రియలో ఎంత సాయపడిందని
నాపై నాకు ఇష్టం చంపుకోవడం లో .
పరమెశునికి దగ్గర చేసిన పరమపద సోపానాలు
పండిపోయిన నా తెల్ల వెంట్రుకలు
నా జీవితం గురించి నాకే గుర్తు, అవగాహన.
అరశతాబ్ది దగ్గర పడుతూంది జీవిత కాలం.
ఆరేడేండ్లకు బాధ్యతలు పూర్తి.
ఆనక బోనసు.. లోకం పట్ల బాధ్యత ఉందా?
నా తెల్ల వెంట్రుకల మహిమ తప్ప నశించేది
ఏమీ లేదని నాకెలా ఎరుక?
తపంలా, జపంలా ఏదో చెప్పాలని నాకెందుకు?
కుర్రతనం కోపాన్ని మింగేసిన నీలకంఠులు.
మూడవ కంటితో మోహాన్ని భస్మము చేసిన
రుద్రం, భద్రం, తపోముద్రం తెల్ల వెంట్రుక.
మనసును కట్టి వేసిన పలుపుతాడు..
నా దారి చూపెడుతూ నను నడిపించు
నేస్తాలు, నా తెల్ల వెంట్రుకలు..
జ్ఞాన నిధులు .మోక్ష వారధులు.
నా జీవిక రధ సారధులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!