చిటపటచినుకులు

చిటపటచినుకులు 

రచన::దోసపాటి వెంకటరామచంద్రరావు

మృగాశిరాకార్తే ప్రవేశం
నేలతల్లి ఎదురుచూపులు ఫలించేవేళ
పృకృతి పరవశించే సమయం
చెట్టుచేమా పువ్వు గువ్వా పులకరించే హేల
చిటపటచినుకులు చిందులేసే వేళ
చిరుజల్లులు పుడమిని తడిపిన వేళ
రైతన్నల కళ్ళలో ఆనందబాష్పాలు చిలికే వేళ
దుక్కి దున్నడానికి సమాయత్తం
ఆవేటిఉత్సవాలకి ఊరంతా సిద్దమయ్యేవేళ
నదినదాలు చిరుజల్లులకలయికకై తపించేవేళ
సాగరతీరంలో అలలు చిరుజల్లులతో నాట్యమాడే వేళ
గ్రీష్మతాపంతో జనజీవనం సేదతీరేది చిరుజల్లులతోనే
కొత్తనీరుతో బావులు వాగులు వంకలు ఉప్పొంగుతాయి
జంతుజాలమంతా దప్పికతీర్చుకుంటాయి
పల్లెపల్లెలో జలసిరులతో జలకాలాడే వేళాయే!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!