ఏడాది పొడవునా అందాలే
రచన::శ్రీ ధూర్జటి
వసంతకాలపు వలపు నిట్టూర్పులతో నేల భావిన బూచాడు చందమామ…!
గ్రీష్మ తాపానికి ఎండిన నేలపై వానచినుకు రాల్చిన గుబాళింపు….!
వర్షాకాలపు చినుకు బిడ్డను పొదివి పట్టి పొత్తిళ్లలో దాచుకున్నదొరువు కాంత …!
హేమంత రాత్రిలో పూచేటి చలిమంట కాచేటి దుప్పటికి సాయమగా….!
శరచ్చంద్రిక లతో తేలు పిల్లగాలి వెండి మేఘాలతో నిండిన చల్లనిరేయి…!
శిశిరాన రాల్చిన ఆకు పరుపుల తోటి నిండుగా నిండిన వీధి అరుగు…!
ఏడాది పొడవునా అందాల సయ్యాట చేరి విరబూయును కదా నా తెలుగునింట..!