వెలుగుకు వెలుగే లేదు

అంశం: చీకటి వెలుగులు

వెలుగుకు వెలుగే లేదు

రచన: వాడపర్తి వెంకటరమణ

రోజంతా వెలుగులు పంచే సూరీడు
అలసి సొలసిన శ్రామికునిలా
పడమటి కొండల్లోకి దిగిపోతాడు
జగతంతా చిక్కగా చీకటి పరుచుకుంటుంది
అంతమాత్రానికే అధైర్యపడిపోతే ఎలా!?

ఆ తిమిరాన్ని తుత్తునియలు చేయడానికి
ధగద్ధగా విచ్చుకున్న స్వర్ణ శరాలతో
మరలా తూరుపు కొండల్లో పొడుచుకొచ్చి
లోకానికి వెలుగు కిరణాలను పంచుతాడు
చీకటి వెనుకే వెలుగుంటుందని
సమస్త మానవాళికి చాటిచెబుతాడు

జీవితంకూడా అంతేకదా…
అదో కష్ట సుఖాలతో కూడిన కలయిక
చీకటి వెలుగుల సమ్మిళితం!

అసలు చీకటే లేకుంటే…
వెలుగుకు వెలుగేలేదు మరి!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!