అమెరికా ఆవకాయ- అమ్మాయమ్మ

అంశం: హాస్య కథ

అమెరికా ఆవకాయ- అమ్మాయమ్మ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

      అమలాపురం నుంచి డెబ్భై ఏళ్ళు దాటిన అమ్మాయమ్మ గారు కొడుకు రాముడు అనబడే రామారావు పదే పదే పిలవగా  ఎట్టకేలకు అమెరికాలో ఉన్న ఒకే ఒక పుత్రరత్నం డాక్టర్ రామారావు దగ్గరకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ చికాగో ఎయిర్ ఇండియా విమానం ఎక్కడానికి మేనల్లుడు సీతాపతి సహాయంతో విమానాశ్రయం దగ్గరకు వచ్చి చెకింగ్ పూర్తి అయి వీల్ చైర్ సహాయం తో వెళుతూ ఒరే సీతాపతి నాకేం భయం లేదురా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. వేళకు తిని పొలం పనులు జాగ్రత్తగా చూసుకో అమలాపురాన్ని చూసిన దాన్ని అమెరికా ఒక లెక్క అనగా అక్కడ వాళ్ళు బామ్మ గారి మాటలకు నవ్వుకున్నారు. ఉంటానే అత్తయ్య అని సీతాపతి మనసులోనే నీతో పెట్టుకున్నవాడు చస్తాడు అని మనసులో అనుకున్నాడు.  అమ్మాయమ్మ గారు బిజినెస్ క్లాసులో కూర్చో పెట్టిన ఎయిర్ హోస్టెస్ తో  థాంక్స్ చెప్పి సీట్ బెల్ట్ పెట్టించుకున్నారు. తెలుగు, ఇంగ్లీషు లో వ్రాసిన, కాఫీ, ఐస్క్రీమ్, భోజనం, వంటివి  అట్టలపై వ్రాసినవి చూపి అడిగి మరీ మరీ తెప్పించుకున్నారు. స్వతహాగా ఐస్క్రీమ్ ప్రియురాలు కాబట్టి బిజినెస్ క్లాస్ కొడుకు రాముడు తీసినందుకు తిండి దగ్గర మొహమాటం లేకుండా లాగించడం ఇచ్చిన వెంటనే థాంక్స్ చెప్పడం మిగతాప్రయాణీకులు చూసి ధైర్యంగా ఆవిడ మాటలు విని మామ్మగారు గురించి చెప్పుకోవడం విన్నా దేవులపల్లి వారు చెప్పినట్లు నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు  అని తన పని తాను చేసుకుపోయారు. మేఘాలపై విమానం వెళ్ళడం చూసి కాంతారావు అదే సినిమా నారదుడు ఇలానే వెళ్ళాడని పాత సినిమాలను జ్ఞప్తికి తెచ్చుకుని ఎయిర్ హోస్టెస్ ను పిలిచి తెలుగు కొత్త సినిమా అందాలరాముడు ఉంటే పెట్టించుకున్నారు
మొత్తం మీద చికాగో విమానాశ్రయం లో తెలుగు ఇంగ్లీష్ కలిపిన అట్టముక్క పట్టుకున్న  వీల్ చైర్ వాడి దగ్గరకు వెళ్ళి చెకింగ్ లో బ్యాగ్ తీసుకుని అక్కడ ఉన్న కొడుకు రాముడిని చూసి ఝాన్సీ లక్ష్మీ బాయి లా లేచి ఏరా నాన్న బాగున్నవా అని తల ఆప్యాయంగా నిమిరేరు. అక్కడే చికాగో లోని ప్రఖ్యాత డాక్టర్ అయినా తల్లికి కొడుకే కదా  రామారావు గారు అమ్మ కి నమస్కారం చేసి తన తెల్లటి కారులో ఎక్కించి బెల్ట్ పెట్టగానే ఒరే చిక్కి పోయావురా రాముడు. పని ఒత్తిడి కోడలు మీనాక్షి, మనుమరాలు స్వప్న బాగున్నారా అని అడిగితే బాగున్నారు అని చెప్పిన కొడుకుతో ఒరే కారు తెల్లగా పెద్ద పడవ అంత ఉందిరా నాకు నచ్చింది అని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేస్తు ఉండగానే ఇల్లు వచ్చింది. అత్తగారు కారులోంచి దిగగానే బాగున్నారా అత్తయ్య అని కోడలు, నానమ్మ అంటూ మనుమరాలు వాటేసుకున్నారు. బాగున్నాను. ఎల్లుండే గృహప్రవేశం  పెద్దవారు మీరు రావడం మాకెంతో సంతోషం అని ఫ్రిజ్ లోంచి ఆకుపచ్చని ఆపిల్స్ తీసి అత్తయ్య ఇవి పుల్లటి ఆపిల్స్ అని కోడలు చెప్పింది. అదేమిటమ్మ పుల్ల ఆపిల్ ఉంటుందా అని నాకో ఐడియా  వీటితో  మన గృహప్రవేశం నాడు ఆపిల్ ఆవకాయ పెట్టొచ్చె
ఆవకాయ లేనిదే మన తెలుగునాట ఏ కార్యక్రమం జరుగదు. ఎన్నివున్నాయి అంటే ఇక్కడ విరివిగా దొరుకుతాయి సాయింత్రం నేను తెస్తాను అన్నకోడలితో ఎంతమంది వస్తారు మన వాళ్ళు అని అంటే సుమారు ఏభై మంది అందరూ మన తెలుగువాళ్ళే. మిగతా వారికి సెలవురోజున పార్టీ మీ అబ్బాయి ఏర్పాటు చేశారు అనగానే ఓ ఏభై ఆపిల్స్, ఆవగుండ, కారం, నూనె తే నేను మామిడికాయని  భ్రమించే రీతిలో తయారుచేస్తాను. అమ్మాయమ్మ  మజాకావ
వయస్సులో ఉన్నప్పుడు తినాలి, పనిచేయాలి అప్పుడు జబ్బులెందుకు వస్తాయి అన్నారు. ఆ రాత్రే రెండు గంటల వ్యవధిలోనే ఆపిల్ ఆవకాయ పెట్టి రేపటికి ఉరి, గృహప్రవేశం వేళకు అందరూ లొట్ట లేసుకు తింటారు మీనాక్షి. ఇది అమ్మాయమ్మ మాట అన్నారు, గృహప్రవేశం నాడు, వాస్తుపూజ, హోమం, సత్యనారాయణ వ్రతము అయి ఒంటిగంటకి భోజనాలు, పులిహోర, బూర్లు అమ్మాయమ్మ గారు చేసినవే, ముక్కలపులుసు, గుత్తి వంకాయ కూర , ప్రసాదం ఆమె చేసిన ఆపిల్ ఆవకాయ  తో బాటు ఐస్క్రీమ్ పెడితే, భోజనాలు సూపర్బ్ మీనాక్షి  అందులో ఆవకాయ చాలా బాగుంది మామిడి కాయలు ఎక్కడ దొరికేయి చాలా రోజులకి మేము ఆవకాయ తిన్నాము అంటే మీనాక్షి మా అత్తగారు అన్నే చేశారు. ముఖ్యంగా పుల్లటి ఆపిల్స్ తో ఆవకాయ చేశారు అని చెప్పగా అత్తయ్య గారి దగ్గరకి ఆందరు వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి ఆంటీ మాకు పెట్టడం నేర్పండి అనగానే రుద్రమదేవి లా ఫోజు పెట్టి తప్పక నేర్పుతాను అని శని , ఆదివారములలో నాలుగు సార్లు అడిగిన వారికి తానే స్వయంగా వారొచ్చి తీసుకెళ్ళినప్పుడు
ఆవకాయ పెట్టడం, క్రమేపి అది అమ్మాయమ్మ ఆవకాయ గా చికాగోలోనే గాక అమెరికాలో ప్రసిద్ధి చెందడం, అక్కడి తెలుగు సభలో అమ్మాయమ్మ గారిని ఘనంగా సత్కరించి అధ్యక్షుని ద్వారా పురస్కారం తీసుకోవడం ఆమె మనుమరాలతోను, సభలోను కూడా నాకు నోబెల్ బహుమతి లభించినంత సంతోషంగా ఉంది జన్మసార్ధకత అయింది అని తిండి కలిగితే కండకలదోయ్
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవి గురజాడ మాటలు చెప్పి లోకా సమస్తా సుఖినో భవంతు అన్నప్పుడు సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారు మ్రోగింది.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!