గోటి ప్రసాదం

అంశం : హాస్య కథ

గోటి ప్రసాదం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: తిరుపతి కృష్ణవేణి

హలో! కస్తూరిగారు ఎలావున్నారు. అంటూ ఫోన్చేసింది. తనఫ్రెండ్సరోజిని. హ! బాగున్నాము అండీ ! మీరెలా! వున్నారు. అంది కస్తూరి మేము బాగానే వున్నామండీ! అవునూ! ఈరోజువ్రతానికి వెళ్తున్నారా! అని అడిగింది సరోజిని. హ! అదే ఆలోసిస్తున్నా! అండీ! నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. మీరు వస్తారో! లేదో! అని అవునండి! వద్దామనే అనుకున్నాను. మా దగ్గర బందువుల ఇంట్లో బారసాల కార్యక్రమం ఉంది. అందుకే ఆలోసిస్తున్నాను. చుట్టాలు కదా! వెళ్లక పోతే వూరికే ఫీల్అవుతారు అంది సరోజిని.
అవును లెండి! అందుకనే నేను కూడా మిమ్మల్ని అడగలేదు. అంది కస్తూరీ. మనకి మొదటి నుండీ బాగా తెలిసిన వారు వెళ్లకపోతే బాగోదు. పెళ్ళి అమ్మాయి ఇంట్లో జరిగింది. అందుకే పెళ్లికి కూడా వెళ్ళలేక పోయాము. కనీసం వూర్లోనేకదా! ఇక్కడి కైనా! వెళ్లక పోతే ఏమ్బాగుంటుంది. మరీ వుధయమే కాక పోయినా! కాస్త లేటుగా అయినా వెళ్ళి కనిపించి వస్తే బాగుంటుందేమో! అని అనుకుంటున్నాను అండి. మాసార్బయటకి వెళ్ళారు. నేను వచ్చేలోపు రెడీఐ ఉండు వెళ్దాం అన్నారoడి! అంటూ ఫోన్ పెట్టేసింది. త్వర, త్వరగా రెడిఐ ఫంక్షన్ కిబయలు దేరి వెళ్ళింది కస్తూరి. అప్పటికే పదకొండుగంటలు కావస్తోంది! పెళ్ళి వాళ్ళదిపెద్ధ రైతు కుటుంబం వూరంతావాళ్ళ చుట్టాలే! పెళ్లి అమ్మాయి ఇంట్లో జరగటం వలన అక్కడికి వెళ్ళలేనివారంతా పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి హాజరు అవుతున్నారు.
వ్రతం ఇంకా పూర్తికాలేదు. కస్తూరి తీసుకెళ్లిన కొబ్బరి కాయ, పూజా సామాగ్రి, పూలు దేవుడి దగ్గరపెట్టాను. అందరూ అయ్యగారు చెప్పే కథ వినటంలో లీనమైపోవడంతో కస్తూరి వెళ్లిబయట టెంట్కింద కుర్చీలు వేసి వుండటంతో అక్కడే ఓ కుర్చీలో కూర్చుంది. అక్కడ కూడా ఓవంద రెండు వందల మంది కూర్చొని వున్నారు. వ్రతం అయిపోయే టైమ్ కి తెలిసిన వాళ్ళుకొంత మంది కలిస్తే వారితో మాట్లాడుతూ, కబుర్లలో మునిగిపోయింది కస్తూరి. పూజ ముగిసింది. చాలా మంది తలో వరుసలో ప్రసాదం పంచుతున్నారు. ఇంతలోమావరుస మధ్య లోనుండి ఒకపెద్దావిడ సడన్ గాలేచి తను కట్టుకున్న పెద్దఅంచుపట్టు చీరపవిట కొంగును నడుంకు బిగించి పెద్దపని వున్నదానిలా! లోపలికి వెళ్ళి చిటికెలో తిరిగి వచ్చింది. వస్తూ, వస్తూ బాగా పండి పోయిన అరటి పండు ఒకటి పట్టుకొనివచ్చి చాలా సీరియస్ గాగోటితో కొద్ది కొద్దిగా తీస్తూలైన్ లోఅందరికీ పంచటం మొదలుపెట్టింది. ఈమెకు కలిపిన ప్రసాదం పళ్లెం దొరకలేదు. త్వరగా ప్రసాదం పంచే పని పూర్తి చేయాలి అనుకుందో ఏమో ఆ అరటి పండును చేత్తో మెత్తగా చేస్తూ గోటితో ఒక్కరికి పంచ సాగింది. కస్తూరీమాత్రం ఆపెద్దావిడనే గమనిస్తూ ఉంది? అసలేకరోనా పుణ్యమా! అని కస్తూరి ఈమధ్యకాలంలో ఎక్కడికైనా వెళితే సాధ్యమైనంత వరకూ భోజనం కూడా చేయకుండానే వస్తోంది. ఎక్కడ, మాస్క్తీయాల్సి వస్తుందోనని. ! అలాంటి కస్తూరి కళ్ళు ఆపెద్దావిడ మీద అమె పంచే గోటి ప్రసాదం మీద పడ్డాయి. కస్తూరికి ఆందోళనమొదలైంది. ఏమిటీ ? కొంపదీసి ఆప్రసాదంనేను కూడా తినాల్సి వస్తుందా! ఓరినాయనో! ఇక్కడి నుండి ఎలాగోలాగ! తప్పించుకోవాలి. ? అని, మనసులోనే అనుకుంటూ పక్కనున్న వారితో మాట్లాడుతూ ఒక కంట ఆవిడని గమనిస్తూనే! వుంది. ఇప్పుడు ఎలా? ఈమె నుండి తప్పించుకోవాలి? ఎదో! గుర్తు వచ్చినదానిలా ఎవరినో! పలుకరిస్తూ! మెల్లగా అక్కడి నుండి బయలు దేరిన కస్తూరి ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయింది. వెనుకనుండి ఓహస్తంతనభుజం మీదపడింది. ఎవరా! అని వెనుదిరిగి కస్తూరి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏమ్మా! నీకు ప్రసాదం అందినట్లులేదు అందరికీ పెట్టాను. నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు. పండుగుజ్జను గోటితో రాస్తూ, తన ప్రమేయం లేకుండానే గోటితో తీసి తన చేతికి రాసినల్లగా మాడిపోయిన తొక్కను బయటకి విసిరేసింది ఆ పెద్దావిడ. చేతిలో  ప్రసాదం చూచుకుంటూ నిర్ఘాంత పోయి అలాగే చూస్తూ! వుండిపోయింది కస్తూరి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!