సాంప్రదాయం

అంశం: కొసమెరుపు కథలు

సాంప్రదాయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

    హాయ్ రవి ఎలా ఉన్నావు హాయ్ నువ్వా ఇక్కడ
వాటే సర్ ప్రైజ్  మా చెల్లెలి పెళ్లి ఉoదని షాపింగ్ కు వచ్చాము. నువ్వేంటి ఇక్కడ దర్శనమిచ్చావు.
మేం కూడా షాపింగ్ కే వచ్చాము మా చెల్లెలు నేను
మా చెల్లెలు ఉషారాణి హాయ్! అన్నాడు. తను కూడా హాయ్ అంది! ఇంకేంటి విశేషాలు మామూలే ఇంకేముంటాయి జాబు  ఎక్కడ ఏదో ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. అదేంటి ప్రైవేటు జాబ్ నీకు ఇష్టం ఉండదుకదా టీచర్ ట్రైనింగ్ చేశావు. అదేంటి రాలెేదా, ఎక్కడో చాలా దూరంగా ఇచ్చారు. మా నాన్నగారు వద్దన్నారు. ఇంత మార్పు వచ్చింది కల్చర్ పెరిగింది ఏంటి మీ నాన్నగారి చాదస్తం. కొన్ని తప్పవు వినాల్సిందే ఏంటి జయ నీవు కూడా మరీను కొన్నింటికి తలవంచాల్సిందే రవి. రవి పెళ్లి చేసుకున్నావ ఇంకా చేసుకోలేదు ఎందుకని
నా విషయం అలావుంచు నీవెందుకు చేసుకోలేదు.
కొన్ని పరిస్థితుల వల్ల చేసుకోలేదు. మా పరిస్థితి నీకు తెల్సిందేగా అప్పటికీ ఇప్పటికీ ఏం మార్పు లేదు జయ. మా మధ్యతరగతి జీవితాలు అలాగే ఉంటాయి. చాలా బాధగా ఉంది జయ అన్నాడు బాధగా? అన్నయ్య ఇక్కడ ఉన్నావా అంటూ వెతుక్కుంటూ సౌమ్య వచ్చింది. ఈమె మా చెల్లెలు సౌమ్య ఈమెకే పెళ్లి  పెళ్లి  ఫిక్సయింది. హాయ్ సౌమ్య కంగ్రాచ్యులేషన్ థ్యాంక్యూ అoడి నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలండి ఓ తప్పకుండా వస్తాను. జయ మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్లాడు. ఆ రోజులే వేరు అనుకుంటూ వేడి నిట్టూర్పు విడిచింది. ఉష పద అంటూ తనకు కావాల్సిన తీసుకొని బయటకొచ్చి ఆటో మాట్లాడుకుని వెళ్లారు.
ఆటోల కూర్చున్నట్టే కానీ తన ఆలోచనంతా గడిచిన కాలం వైపు మనసు మళ్లింది. రవి తను ఇద్దరూ క్లాస్ మేట్స్ ఎన్నో రోజుల తరువాత మళ్లీ ఇప్పుడు కలుసుకున్నాం. కులాలు వేరైనా ఎంతో స్నేహంగా వుండేవాళ్లం మేము బ్రాహ్మణ్స్ కాబట్టి మా ఇంట్లో ఆచార వ్యవహారాలు చాలా ఉండేవి మా నాన్నగారు ఎవర్నీ రానిచ్చేవారు కాదు చాల సిస్టమేటిగ్గా ఉండేవారు. ఆ కాలమే వేరు కాలాన్ని బట్టి మార్పులు రావాలి మా కుటుంబంలో ఏ మార్పులు రాలేదు. కట్నం ఇవ్వలేక కొంత నచ్చలేక కొంత ఇలా సంబంధాలు వచ్చిపోతున్నాయి. కానీ ఎవ్వరూ చేసుకోవడానికి ముందుకు రావడంలెేదు ఇలా సాగిపోతున్నాయి. రోజులు అక్క ఇల్లు వచ్చింది అనడంతో జ్ఞాపకాల నుండి బయటకొచ్చి అప్పుడే వచ్చిందా అంది ముక్తసరిగా! అవుననక్కా షాపింగ్ అయిందా అంటూ పలకరించాడు అవును నాన్నా అన్నారు ఇద్దరును, జయ చెల్లెలకు సంబంధం వచ్చింది నీవేమంటావు అన్నారు. మంచిదేగా నాన్నగారు ఎప్పుడొస్తున్నారు. అంది! వాళ్లే మంచిరోజు చూసుకొని వస్తామన్నారు.
అలాగే నాన్నగారు అంది. నీకేం బాధ లేదు కద అన్నారు బాధతో నాకేం బాధ నాన్నగారు నా చెల్లెలే గా నా కెందుకు బాధగా ఉంటుంది. నాన్నగారు!అదోలా నవ్వుకుంటూ అంది! గుండెలో కత్తితో పొడుస్తూ  బాధగా ఉందా అమ్మా? అంటే ఏం చెప్పను. తను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం మానుకుంది. తను జాబ్ చేసుకుంటూ బ్రతకాలని తను గట్టిగా నిర్ణయించుకుంది. భోజనాలు చేసి తీరుబడిగా కూర్చున్నారు, అంతలో ఉష వచ్చి మాబట్టలు చూడు మమ్మీ ఎలా ఉన్నాయో చెప్పు అంది. చూస్తాన్లేవే ఎందుకెే తొందర కొద్దిసేపు నడుంవాల్చని తరవాత చూస్తాను అంది! ఏమే ఇలా వచ్చి ఫోన్ చూడు ఎవరో ఫోన్ చేశారు. అంటూ పిలిచారు. ఆ వస్తున్నానండి ఇప్పుడే నడుం వాల్చాను. ఒక్క నిమిషం కూర్చోనివ్వరు గా
అంటూ ఆయాస పడుతూ వచ్చింది. హలో ఎవరండీ శర్మ గారేనా నoడి నేను ఆయన భార్యను మాట్లాడుతున్నానండి నమస్కారమమ్మా నేను పెళ్లిళ్ల పేరయ్యను మాట్లాడుతున్నాను. ఆ చెప్పండి రేపు దివ్యమైన ముహూర్తం ఉందండి రేపు మీ అమ్మాయిని చూసుకోటానికి వస్తున్నారు. సరేనoడి మా వారితో చెప్తాను. మరి ఉంటాను. ఏమండి విన్నారా రేపు అమ్మాయిని చూసుకోడానికి పిల్లాడి వాళ్లు వస్తున్నారట నడ్డి వస్తేరానివ్వు వస్తే మంచిదేగా అన్నారు. మరుసటి రోజు పనులన్నీ తొందరగా ముగించుకున్నారు వెళ్లి వారి కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే పెళ్లి వారు రానే వచ్చారు. వారు కుశల ప్రశ్నల తర్వాత అమ్మాయిని చూపించారు. అమ్మాయిని చూసి ఇష్టపడ్డారు. కట్నకానుకల విషయమేంటి అని అడిగాడు అమ్మాయి తండ్రి రెండెకరాల భూమి అయిదు తులాల బంగారం పెట్టామన్నారు. పిల్లాడి తరుపువారు మాకు అంత స్థోమత లేదు అంత ఇచ్చుకోలేమని అన్నారు. పెళ్లిళ్ల పేరయ్య కల్పించుకొని రెండు తులాల బంగారం పెళ్లి ఘనంగా చేయమని చెప్పారు. సంతోషంతో సరేనన్నారు. రెండు వారాల్లో మంచి ముహూర్తాలున్నాయని అన్నారు. మే నెలలో మంచి ముహూర్తం నిర్ణయించారు. అనుకున్న ప్రకారం పెళ్లి ఘనంగా చేశారు. ఉష అక్కను గట్టిగా వాటేసుకుని భోరుమని ఏడ్చింది. ఏంటి ఉష ఎందుకేడుస్తున్నావు ఊరుకో పిచ్చిపిల్లలా ఎందుకేడుస్తున్నావు.
నిన్ను విడిచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది అంటూ ఏడ్చింది. నేను ఒక్కదాన్నే  ఎందుకుంటాను. అమ్మానాన్న ఉన్నారు గా నాకు తోడు నువ్వేం దిగులు పెట్టుకోకు సంతోషంగా ఉండు అంది అనునయంగా అప్పుడప్పుడూ నా దగ్గరికి ఇస్తుంటావుగా అంది! జయ అని పిలవడంతో ఇటు వైపు తిరిగారు. రవి తన చెల్లెలు సౌమ్య వచ్చారు. రా రవి అంటూ లోపలికి రమ్మంది! నాన్నగారు మా ఫ్రెండ్ రవి వచ్చడని చెప్పడంతో బయటకు వచ్చారు. అంతా కులాసా యేనా బాబు, అంటూ పలకరించారు. నమస్కారమండి! అంటూ పాదాలకు నమస్కరించాడు. నమస్కారం కూర్చో బాబూ! మీరెలా వున్నారు మీ ఆరోగ్యం కులాసాయేనా అని పలకరించారు రవి” ఏదోఅలా   ఉన్నాం. వచ్చే ఏడవ తారీకు మా చెల్లెలి పెళ్లి ఉందండి మీరందరు తప్పకుండా రావాలి అని చెప్పారు. సరెబాబు అలాగే వస్తాం. టీ పట్టుకొస్తానని లోపలికి వెళ్ళింది జయ” ఇప్పుడేం వద్దు జయ అన్నాడు. ఎంతలో పట్టుకొస్తాను ఉండండి టీ తాగి వెళ్ళండి అంది సరే నని టీ తాగి బయటకొచ్చారు.
అటు జయ చెల్లెలు పెళ్లి ఇటు రవి చెల్లెలు పెళ్లి    ఘనంగా జరిగాయి. జయ అంటూ రవి పిలిచాడు.
ఏంటి చెప్పు రవి అంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. లేదు రవి నేను ఎవర్నీ పెళ్ళి చేసుకోను నేనిలాగే ఉండిపోతాను అంది బాధగా ఎందుకని
ఈ పెద్ద వయసులో అమ్మానాన్నలను బాధ పెట్టడం నాకిష్టం లేదు. వాళ్లను చూసుకుంటూ ఇలాగే ఉండిపోతాను అంది కులం అడ్డువస్తుంది. నాన్నకు ఇష్టం ఉండదు. నాన్నకు ఇష్టం లేని పని నేను చెయ్యలేను. ఇప్పటికీ మీ చాదస్తాలు పోలేదు అన్నాడు. అంతే రవి ఈ జన్మకు పెళ్లి అనేది ప్రాప్తం లేదు అంది బాధగా చేసేది ఏమిలేక బరువెక్కిన గుండెతో వెళ్ళిపోయాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!