మాస పోటీలు

తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక
మనోహరం మాస పోటీలు

తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక నిర్వహించు “మనోహరం వాట్సప్ మాస పోటీలు”

మనోహరం వాట్సప్ గ్రూప్ మాస పోటీలు (సోమవారం – శనివారం: 7am – 7pm)

సోమవారం మరియు మంగళవారం
ప్రతి నెల నాలుగు వారాల్లో రెండు వారాలు మనోహరం వారు ఇచ్చే కథాంశం మీద, మరో రెండు వారాలు వారికి నచ్చిన అంశం మీద కథ ఇవ్వవచ్చు.

బుధవారం
రచయితలు మనోహరం వారు ఇచ్చిన అంశం మీద కవితను రాయవలసి ఉంటుంది.

గురువారం మరియు శుక్రవారం
రచయితలు తమకు నచ్చిన ఏదైనా అంశం (కథ/కవిత/పుస్తకం/సినిమా/ప్రముఖులు.. etc) మీద సమీక్ష/వ్యాసం రాయవలసి ఉంటుంది.

శనివారం
రచయితలు తమకు నచ్చిన అంశం మీద ఏదైనా ప్రక్రియలో కవిత రాయవలసి ఉంటుంది.

మాస పోటీ వివరాలు & రూల్స్
1. నెల మొత్తం మీద అర్హత పొందిన రచయితల నుండి ఐదుగురు రచయితలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబడును.

2. నెల మొత్తం కలిపి 4 లేదా అంతకు మించి రచనలు చేసిన వారు మాత్రమే పోటీకి అర్హులు. (2 మనోహరం వారు ఇచ్చిన అంశం మీద మరియు 2 రచయితలకు నచ్చిన అంశం మీద రాయవలసి ఉంటుంది.) మాస పోటీకి అర్హులైన వారి రచనలు మాత్రమే మాస పోటీల e-book లో ప్రచురించడం జరుగుతుంది.

3. మీ రచనలకు మనోహరం వెబ్సైట్ లో ఖచ్చితంగా 10 లేదా అంతకు మించి వీక్షణలు(వ్యూస్) ఉండాలి.

4. మాస పోటీలలో ప్రతి అంశం మీద వచ్చిన రచనలలో కొన్నిటిని సెలెక్ట్ చేసి, వాటిని మనోహరం వార(ప్రచురించుటకు 3 నుండి 5 వారాల సమయం పడుతుంది), మాస పత్రిక లేదా మాస పోటీ e-bookలో ప్రచురించడం జరుగుతుంది.

5. రచయితలు తమ రచనలో ఖచ్చితంగా అక్షర దోషాలు సరి చూసుకొనవలెను, వాటికి కూడా పోటీకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇచ్చిన సమయంలో వచ్చిన రచనలు మాత్రమే పోటీకి అర్హత కలిగి ఉంటాయి.

6. కథ/వ్యాసం/సమీక్ష నిడివి 200-1200 పదాల వరకు ఉండవచ్చును, కవిత 10-16 లైన్స్ వరకు ఉండవచ్చును.

7. పోటీ సమయం ముగిసిన అదే రోజు రాత్రి లేదా మరుసటి రోజు తపస్వి మనోహరం వెబ్సైట్ లో (రచనలు ఎటువంటి మార్పులు, అక్షర దోషాలు సరి చేయబడవు) మీ రచనను ప్రచురణ చేసి, మీకు లింక్స్ ఇవ్వబడతాయి.

8. పోటీ ఫలితాలు.. పోటీ ముగిసిన 10 లేదా 15 రోజులలోగా ప్రకటించబడతాయి.

9. మాస పోటీలకు పాల్గొనాలి అనుకున్న వారు ఖచ్చితంగా మనోహరం వాట్సప్ గ్రూప్ లో సభ్యులు అయి ఉండవలెను.

10. మీ రచనలతో మీ పేరు, శీర్షికతో పాటు హామీ పత్రం విధిగా రాయవలెను. ఇంతకు ముందే ప్రచురింపబడిన, పోటీ పరిశీలనలో ఉన్న రచనలు స్వీకరించబడవు. రాజకీయ, వ్యక్తిగత దూషణ ఇత్యాది అసాంఘిక విమర్శలు, రచనలు నిషేధం.

11. పోటీలో గెలుపొందని రచనలు తపస్వి మనోహరం వెబ్సైట్ నుండి తొలగించబడవు మరియు పత్రికకు సెలెక్ట్ చేసిన రచనలు, పత్రికలో వచ్చిన 7 రోజుల తర్వాత మాత్రమే మీ రచనలను వేరే ఎక్కడైనా పోస్ట్ చేసుకోగలరు.

12. పోటీ ఫలితాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం. ఇందులో ఎటువంటి వాదోపవాదాలకు తావు లేదు. అవసరమైనచో ఈ నియమ నిబంధనలలో మార్పులు చేర్పులు చేయబడును.

మనోహరం -1, 2 గ్రూప్స్ లో లేని వారు మాస పోటీలో పాల్గొనాలి అంటే క్రింది లింక్ ద్వారా మనోహరం-2 గ్రూప్లో జాయిన్ అవగలరు.
https://chat.whatsapp.com/BUIK1lzamQv4IyGnnQaqgw

మనోహరం చర్చా వేదిక లో మీ రచనలు పై అభిప్రాయాలు ఇతర రచయితలు, పాఠకులని అడిగి తెలుసుకొనవచ్చు.
మనోహరం చర్చా వేదిక వాట్సప్ గ్రూప్ లింక్..
https://chat.whatsapp.com/BeVPCx1TRHoI8A7hSveG58

గమనిక::

1. మనోహరం వాట్సప్ గ్రూపులో మీ కథలు ఇస్తున్నారు కనుక ఈమోజీలు, ఇతర గుర్తులు పెట్టకూడదు.
2. పోటీలో గెలుపొందని రచనలు తపస్వి మనోహరం వెబ్సైట్ నుండి తొలగించబడవు. మరియు పోటీ ఫలితాలు వెలువడిన 7 రోజుల తర్వాత మాత్రమే మీ రచనలను వేరే ఎక్కడైనా పోస్ట్ చేసుకోగలరు.
3. పోటీ ఫలితాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వివరాలకు సంప్రదించవలసిన చిరునామా::
ఫోన్ నంబర్::
కార్తిక్ నిమ్మగడ్డ: +91 7893467516

మెయిల్ ఐడి::
manoharam.editor@gmail.com

తపస్వి మనోహరం వెబ్సైట్:: https://thapasvimanoharam.com/

 

You May Also Like

5 thoughts on “మాస పోటీలు

  1. పత్రిక మెస్సేజ్ ఈరోజే చూసాను. అక్షరాలు మరీ చిన్నవిగా ఉన్నాయి. మీరు ఇచ్చిన లింక్స్ లో కాకుండా మరే విధంగానూ బుక్ ఓపన్ చెయ్యలేమా .. సహరి బుక్ లాగ. ట్రై చేసినా పేజి పెద్దగా అవలేదు. అందుకు ఏమీ చదవలేక పోయాను.

    1. నమస్తే సర్/ మేడం.. తపస్వి మనోహరం వెబ్సైట్ హోం పేజ్ లో వార, మాస పత్రికలు కనిపిస్తాయి. అలాగే మీకు క్రింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. zoom చేసి చదువుకోవచ్చు. ఇంకా మీకు సందేహాలు ఉంటే క్రింది నంబర్ లో సంప్రదించండి. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. 🙏

      ఫోన్ నంబర్: 7893467516

  2. తపస్వి మనోహరం వారికి నమస్కారములు.
    కవితలు వ్రాయడం మా దంపతులిరువురి అభిరుచి.
    మా ఇద్దరికీ ఒకే ఫోన్ నెంబర్ & email id ఉంటాయి.
    సాంప్రదాయ వేడుకలకు, సామాజిక సమస్యలకు,
    ప్రకృతి సౌందర్యాలకు, ఆధ్యాత్మిక విషయాలకు,
    బంధువర్గంవారి శుభసందర్భాలకు స్పందించి
    అవకాశం ఉన్నప్పుడల్లా కవితలు వ్రాస్తుంటాము.

  3. ఈ వారం పత్రిక ను అద్భుతం గా రూపొందించిన సంపాదకులు కార్తిక్ గారికి, సంపాదక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
    కృషీవలుని కథ రచయిత్రి గారు అక్షరీకరించిన నాగయ్య రైతు ఆత్మ హత్య తీరు కన్నీళ్లు తెప్పించింది.. జై జవాన్ జై కిసాన్ అని చెప్పే ఈ దేశం లో రైతులకు కలిగే కష్టాలు ఉదాహరించిన తీరు అద్భుతం… రచయిత కు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!