శనిదేవుడు

శనిదేవుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం

ఒక ఊరిలో శంకర శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన కు తనకు బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం. అంతే కాదు, ఎవరైన బ్రాహ్మణులు భిక్షాటన కు వస్తే చాలు మనసు బాధ పడుతుంది, అందకే అలా బిక్షాటన వచ్చేవారికి తన ఇంట్లో ఉన్న తనకు కలిగినది దానం ఇచ్చేవాడు, అందకే ఆ చుట్టుపక్కల బ్రాహ్మణులు ఎవరైనా శంకరశాస్త్రి ఉన్న ఊరిలోనే బిక్షాటన చేసేవారు. ఎందుకంటే బిక్షం కచ్చితంగా దొరుకుతుంది కాబట్టి, ఆ ఊరికి దగ్గరలో ఒక ఆగ్రహరం ఉంది. అందలో గణపతి, చలపతి అనే ఇద్దరు బ్రాహ్మణ బిక్షగాళ్ళు నివసిస్తూ! వారు పత్రిరోజు శంకరశాస్త్రి వాకిట్లో నిలబడి బిక్షం అడుక్కొనేవారు. అయితే  మొదట గణపతి బిక్షం తీసుకొనేటప్పుడు తమరు ప్రభువులు మీ చేయి చాలా గొప్పది మీ వంశం చల్లగా ఉండాలి తమకు కలిగిన దానిలో మాబోటి పెదలకు ఇంత పెట్టాలి అంతా బ్రాహ్మణోతమధీనం అనేవాడు. చలపతి తమ మీద భగవంతుడు కటాక్షం ఉండాలి తమ చేత ఆ దేవతలు మాబోటి వార్లకింత ఇప్పించాలి అంతా దైవాధీనం అని అనేవాడు. మన శంకరశాస్త్రి ఇద్దరికితోచినది దానంచేసేవాడు. ఐతే గణపతి బిక్ష గాడి మీద అభిమానం కాస్త చూరకుంది. శంకరశాస్త్రి తన భార్య తో అన్నాడు, నేను ఉత్తమ బ్రాహ్మణుడను మన బ్రాహ్మణుల బాధ ను కాస్తన్న పంచుకోవడం నా బాధ్యత కానీ మధ్యలో దేవుడు ఏంది? దేవతలు ఏంది? ఐనా ఈ దైవాధీనం ఎంతవరకూ పని చేస్తుందో చూతాం అని కాస్త గర్వపడ్డాడు. అప్పుడు శంకరశాస్త్రి భార్య తన భర్త తో స్వామి మీరు ధన్యులు మీకు ఆ దేవతల అనుగ్రహం ఉంది ముఖ్యంగా ఆ “శినిదేవుడు”ఆనుగ్రహం, మీకు వచ్చిన ఆలోచన తప్పు ఇంకా మీరు ఆ బిక్షగాళ్ళను పరీక్షించి చూడండి వారిలో ఒకరు “శినిదేవుని “ఆగ్రహానికి గురైన వారు అందుకే మీకు వారిలోని పొగడ్తలు పని చేస్తున్నాయి. కాబట్టి ఈ సారి వారు బిక్షాటనకు వచ్చినప్పుడు ఈ విధంగా చేయమని శంకరశాస్త్రి భార్య సలహా భర్తకి భోదించింది. శంకరశాస్త్రి భార్య చెప్పిన మాటలు కూడా బాగుందని తలచి తన పనివాడి తో ఒక గుమ్మడి కాయను తీసుకు రమ్మని దానిలో కొన్ని బంగారు నాణ్యాలు కూర్చి దాని మరలా అంటించి కనిపించకుండా చేసి దానిని గణపతి బ్రాహ్మణునికి ఎప్పటి లాగే దానం ఇచ్చాడు. అతడు ఎప్పటి లాగే అంత  బ్రాహ్మణోతంఅధీనం అని పోగిడి శంకరశాస్త్రి గారు ఇచ్చిన గుమ్మడి కాయను భుజం మీద పెట్టుకుని వెళ్ళపోయాడు గణపతి! “శంకరశాస్త్రి భార్య తో చూశావా! ఇప్పుడే మంటావు అంటూ గర్వపడిసాగాడు, శంకరశాస్త్రి భార్య కేసి చూస్తూ! గణపతి ఆ గుమ్మడి కాయ పట్టకుని పోతూ ఇదేమిటి రోజు ఏదో ధాన్యం ఇప్పించగా ఈ దిక్కుమాలిన గుమ్మడి కాయ ఇప్పించాడు. దీనిని ఎవరికైనా ఇచ్చేసి ధాన్యం పట్టుకు పోదాం ఇది బరువుగా కూడా ఉందని అనుకున్నదే తడువుగా దారిలో ఒక కోట్టు వానికి ఆ గుమ్మడి కాయను ఇచ్చేసి దానికి బదులుగా ధాన్యం గింజలు పట్టుకుని ఇల్లు చేరాడు. చలపతి కూడ బిక్షాటనకు రాగ శంకరశాస్త్రి ఏదో ఇచ్చిపంపేడు అతను కూడా మునిపిటలాగే అంతాదైవాదీనం దేవతలు మిమ్మల్ని చల్లగా చూడాలని దీవించి, ఆ దారినే వస్తూ ఉండగా అతనికి ఆ గుమ్మడి కాయ కనిపించింది వెంటనే కోట్టు వాని దగ్గర కు పోయి అయ్యా! నేను బిక్షగాడను బ్రాహ్మణుడను కాస్త ఆ గుమ్మడి కాయ ను వండుకొని చాలా కాలం అయినది తమరు ఇప్పిస్తే తమ పేరు చెప్పకొంటామని యాచించగా! కొట్టు వాడు సరే పట్టుకు పొమ్మని గుమ్మడికాయ ఇచ్చాడు. చలపతి ఆనందపడి ఇల్లు చేరి పెళ్ళాం చేతికి ఇచ్చి కూర చేయమన్నాడు. దాన్ని ఆమె దాన్ని ముక్కలు చేయగా అందులో నుంచి బంగారు నాణ్యాలు కనించింది. ఇదే దైవాధీనం అనుకున్నారు. చలపతి దంపతులు. ఆ మరునాడు యధాప్రకారం గణపతి భిక్షానికి పోయాడు, తన వాకిటలో శంకరశాస్త్రి వాన్ని చూసి  బంగారు ఇచ్చినా మళ్ళీభిక్షాటనకు వచ్చాడేమిటి ఈ బ్రాహణుడు అని శంకరశాస్త్రి ఆశ్చర్యంగా చూసి, నిన్నటి రోజునాడు ఇచ్చిన గుమ్మడికాయను తినలేదా అని అడిగాడు. గణపతిని. గణపతి ఓ తిన్నాము చాలా రుచిగా ఉంది అంత బ్రాహ్మణో తమధీనం అన్నాడు. నీ అబద్ధాలు కట్టి పెట్టి నిజం చెప్పు లేదంటే రేపటి నుంచి ఈ ఆగ్రహరంలో రానివ్వకుండా చేస్తా అని కోపంగా అన్నాడు. గణపతి కి దెబ్బకు దెయ్యం వదలి జరిగిన దంతా చెప్పేశాడు. బంగారు నాణ్యలు ఉన్న గుమ్మడి కాయ కొట్టువాడి దగ్గర ఉందని వాడి దగ్గర కు పోయి అడగగా, నిన్న ఈ బ్రాహ్మణుడు ఇచ్చిన గుమ్మడి కాయను ఏమి చేసావు అని అడిగాడు. కోట్టు అతను శాస్త్రి గారు ఇది బ్రాహ్మణ సొత్తు నాకెందుకని నిన్ను మరో బ్రహ్మణుడి వచ్చి అడిగితే ఉచ్చితంగా ఇచ్చేసాను అని చెప్పగా అతని ఆనవాలు ప్రకారం చలపతి అని తెలుసుకోని ఇంటికి పోయి కొట్టు వాడు ఇచ్చిన గుమ్మడి కాయను తిన్నారా! అని అడుగగానే అది తినడానికి ఏముంది మహారాజా దాన్ని కోసి చూడగా బంగారం దొరికింది. అంత దైవాధీనం దేవతల అనుగ్రహం చేత నా దారిద్ర్యం తీరిపోయింది. అన్నాడు. శంకరశాస్త్రి గణపతి కి సహాయం చేయగా అది చలపతికి దక్కింది అంతా దైవాధీనం, దేవతల అనుగ్రహం  మనిషిఆధీనం ఏమి లేదని బుద్ధి తెచ్చుకుని పొగరుచేత వాడిమాటలు విని అంతా మనధీనం అని గర్వపడినాను. ఈ రోజు నాభార్య నా పోగరు కుదుర్చింది. అంతా ఆ శినిదేవుని” మహిమా అని గణపతికి బుద్ధి చెప్పి నీవు మనుష్యులను పోగడటం మాని దైవాధీనంగా బావించమని హితవు చెప్పి భార్య ను మెచ్చుకొన్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!