అతినమ్మకం

అతినమ్మకం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు

గోపి ఒక ఉపాధ్యాయుడు. కర్రివలస అనే గ్రామం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నాడు.తనకి ఇద్దరు పిల్లలు.ఊర్లో కాస్త మంచి పేరు ఉంది.తనలోకం తన వృత్తి తప్ప ఇంకో లోకం తెలియనివాడు. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తరువాత తన పిల్లలకు చెప్పుకునే వాడు.ఇంతలో పాఠశాలకు గిరి అనే ఉపాధ్యాయుడు అదే స్కూల్ కి transfer పై వచ్చాడు. చాలా మంచివాడు.మంచి చురుకుగ ఉన్నవాడు. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నవాడు.మహా మేధావి.గిరికి తెలియని విషయం అంటూ యేమి లేదు.అన్ని రకాలుగా ఆస్తిపాస్తులు కూడ ఉన్నవాడు.
అయితే కాలానుగుణంగా ఇద్దరి స్నేహం బలపడింది.స్కూల్ లో ఎంత ఉన్న బయట రాత్రి 10వరకు మాట్లాడుతూ కాలం గడిపేవారు.ఈ సమయంలో గోపి పిల్లల పై శ్రద్ధ కూడా పెట్టడం మానేశాడు.ఎక్కడకు వెళ్లినా ఒకరువెంట ఒకరు వదిలి వెళ్లేవారు కాదు.అందరినోటిలో కూడా ఒకరిఆత్మ ఒకరు అని చెప్పుకునేవారు.గోపి మొత్తం గిరి పై ఆధార పడేవాడు.ఎంతలా అంటే ఒక అడుగు వేయాల వద్ద అన్నంతలా.
ఇంతలో గిరి వ్యాపారంలో అడుగుపెట్టాడు.అదే సమయం లో గోపి దగ్గర అంత లేదు కాబట్టి సమయం వచ్చినప్పుడు భాగస్వామి చేస్తానన్నాడు గిరి. ఆ వ్యాపారం లో చేదోడు వాదోడుగా గోపిని ఉంచి కొంత ఆర్ధిక లాభం కూడా చూపించాడు గిరి గోపీకి. వ్యాపార క్రమం లో గిరికి కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. వాళ్లు కూడా దేనికైనా రెడీ ఏ పనైనా చేయగల సమర్థులు.అయితే గోపీకి మాత్రం గిరిని నమ్మడం అనుసరించడం తప్ప ఇంకొక ఆలోచన లేదు. గిరి వ్యాపారం మూడు పువ్వులు 60కాయలు గా మారింది.గోపి వ్యాపారం భాగస్వామ్యం లో చేర్చుకోమని గిరిని చాలాసార్లు ప్రాధేయ పడ్డాడు.నేనుంటే నువ్వు ఉన్నట్టు కాదా నాది నీది కాదా అని మాటను దాటించేవాడు.కానీ గోపి మాత్రం మన గిరి నా గిరి ఎప్పుడు నన్ను వదలడు అనే పిచ్చి నమ్మకంతో ఉండేవాడు.
కాలానుగుణంగా tranfers అయ్యాయి ఇంకొక స్కూల్ మారారు. మళ్ళీ ఇద్దరు ఒకే స్కూల్ లో జాయిన్ అయ్యారు.సుమారు 15 సంవత్సరాలు వారి స్నేహం ఎంతో అన్యోన్యంగా ప్రేమానురాగబంధాలు తో సాగింది.ఏ శక్తి విడదీయలేని బంధం అది.గిరి లాంటి మేధావి అస్తిపరుడు చురుకైనవాడు నా పక్కన ఉన్నాడనే గర్వం గోపీకి కూడా పెరిగింది.
ఎటువంటిదైన ప్రకృతి లో విధిరాతకు తల వంచక తప్పదు.ఏమి జరిగిందో ఎలా జరిగిందో కాలం వీరి స్నేహం పై చిన్న చూపు చూసింది.గిరి వ్యాపారంలో గోపీకి ససేమిరా అని చెప్పాడు.కానీ స్నేహం కూడా మెల్లిగా దూరం చేసాడు.రోజులో 20గంటలు కలిసి మెలసి ఉన్న వాళ్ళు ఇప్పుడు కనీసం 20రోజులకు ఒకసారి కూడా కలవడం లేదు.ఫోన్ లో మాటలు కూడా దూరం అయ్యాయి. మనిషి ని దూరం చేసాడు స్నేహం దూరం చేసాడు గిరి.ఎవరికి  చెప్పుకోలేక కక్కలేక మింగలేక జీవితపయనం సాగిస్తున్నాడు గోపి.
గిరికి డబ్బు సంపాదన పెరిగింది.డబ్బు వ్యామోహం పెరిగింది.విలాసవంతమైన జీవనానికి ప్రాధాన్యత ఇస్తూ కొత్త మిత్రులు తో జీవనయానం సాగిస్తున్నాడు. అడపా దడపా బాగోదు కదా అని గోపిని కనిపిస్తే మాట్లాడుతున్నాడు.విడిపోలేదు కలవడం లేదు.ఇప్పటికి గోపి కనిపిస్తే గిరి గుండె కోసి చేతులో పెట్టేస్తాడు.కానీ వ్యాపార భాగస్వామిని మాత్రం చేయలేదు.గోపి మాత్రం ఇప్పటికి తనని ఎందుకు గిరి దూరం ఉంచాడో తెలియక తనదైన శైలి లో జీవితం కొనసాగిస్తున్నాడు.
నాకు తెలిసినది ఏమిటంటే ఎవ్వరూ ఇంకొకరిపై ఆధారపడకూడదు.ప్రతి ఒక్కరికి స్వతంత్రత ఉండాలి.ఎవ్వరూ పిరికిగా కనిపించకూడదు.సమర్ధత లేకపోతే ఎంత మిత్రుడైన మనల్ని దూరంగా ఉంచుతాడు. అలాగే ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు.అతినమ్మకం పనికి రాదు బంధమైన బందుత్వమైనా స్నేహమైనా నువ్వు సమర్ధుడువి కాకపోతే నిను దూరంగా ఉంచుతారు.పొమ్మనకుండా పొగ బెడతారు.గోపి కథే నిదర్శనం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!