అచ్చర

అచ్చర

రచన : దినకర్ రెడ్డి

ఏంట్రా వీడు. ఎప్పుడూ బయటే స్నానం చేసే వాడు. ఈ వేళ కొత్తగా బాత్రూం లోపలికి వెళ్ళాడు అని వంశీ అనుకున్నాడు. రేయ్ శ్రీకాంత్! అంటూ పిలిచాడు తమ్ముణ్ణి.

ఏంట్రా బాబూ అని లోపల్నుంచి అన్నాడు శ్రీకాంత్.
నువ్వేదో దాస్తున్నావ్ అన్నాడు వంశీ బ్రష్ చేసుకుంటూ.

దేవుడా! అన్నను ఇవ్వమంటే అనుమానపు పక్షిని ఇచ్చావేంటి. నన్ను ప్రశాంతంగా స్నానం చెయ్యనీ. ఇందాక నీకేదో ఫోన్ వచ్చింది అంటూ వంశీని డైవర్ట్ చేశాడు శ్రీకాంత్.

వంశీ పెరట్లోంచి హాల్లోకి వెళ్ళగానే శ్రీకాంత్ తడిచిన శరీరంతో వెనుక ఉన్న బెడ్ రూం కి వెళ్లి బట్టలు వేసుకున్నాడు. మెడ కనిపించకుండా కాలర్ ఉన్న షర్టు వేసుకుని పై బటన్ కూడా పెట్టుకున్నాడు.

శ్రీకాంత్ పరుగులాంటి నడకతో పక్క దారిలోంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇరవై నాలుగ్గంటలూ టీషర్ట్ వేసుకుని తిరిగే వీడు ఆదివారం రోజు ఫార్మల్ షర్టు వేసుకుని వెళుతున్నాడు. ఖచ్చితంగా ఏదో విషయం ఉంది అనుకున్నాడు వంశీ.

అయినా ఈ ఇంగ్లీష్ నవలల్ని అనాలి. ఎవరైనా అచ్చర పడేట్లు కొరుకుతారా. అదీ మెడ కింద. ఇప్పుడు దీన్ని దాచుకొని తిరగలేక చస్తున్నాను అని గర్ల్ ఫ్రెండ్ చదివే ఇంగ్లీష్ నవలల్ని తిట్టుకుంటూ, లవ్ బైట్ ని తలచుకుని అడుగులు ముందుకు వేశాడు శ్రీకాంత్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!