అద్భుత రూపం

(అంశం:”సంధ్య వేళలో”)

అద్భుత రూపం

రచన: చెరుకు శైలజ

సంధ్యావేళ సాగరతీరం అందాలు అరబోసేవేళ
సంధ్యా కాలం సూర్యుడు
లేత ఎరుపు రంగులో అస్తమిస్తున్న వేళ
అసుర సంధ్య గోదావరి ఉరకలు ఉత్సాహపరిచే వేళ
గోధూళి వేళ గోవులు ఇంటికి వచ్చే వేళ
మధురమైన వేళ మనసులో
ఆనంద తరంగాలు మెదిలే వేళ
కన్నులలో మెరుపులు మెరిసే వేళ
పూల సోగసులు పరిమళించే వేళ
గువ్వలు గూటికి చేరే వేళ
గుడిలో జేగంటలు మోగే వేళ
సంధ్యా సమయం ప్రకృతి ఎంత రమణియం
సుందర రూపం ప్రకృతి స్వరూపం
ఎంతో అద్భుత రూపం ఆహ్లాదకరం

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!