జన్మదిన శుభాకాంక్షలు బుజ్జమ్మ

జన్మదిన శుభాకాంక్షలు బుజ్జమ్మ

బుజ్జమ్మ పలుకులు అంటూ…
తన మది గదిలోని మాటల మూటల్ని
అందరికి అర్థమయ్యేలా
అద్భుతమైన భావోద్వేగాన్ని
అందమైన పదాలతో…కవనం విరచించే కవయిత్రి

ఏంటో బుజ్జి అంటూ….
సరదా పదాలతో…
పాఠకుల మది పూతోటలో
నవ్వుల పూవులు విరబూయించే
చమత్కార రచనలు చేసిన రచయిత్రి

నా…నీ…కోసం అంటూ…
సందేశం కోసం ఎదురుచూసే
ఒక మనసు తపనని ప్రేమని
విలువైన వ్యాఖ్యానంతో
లేఖా సాహిత్యాన్ని వికసింపజేసిన అక్షర మైత్రి

లోకంలో ఉన్న నిరాశని
కలల కలంతో దుఃఖిస్తూ…
కన్నీళ్ల వర్షం తర్వాత
మనసనే మేఘం తేలికైనట్టు
అంధకారంలో అద్భుతాలను చూపించే సహనపు ధాత్రి

జీవితంపై నాస్తికత్వంతో ఉన్నా అనుకునే
ఒక గొప్ప ప్రేమ భక్తురాలు
ఆప్యాయత అనుబంధాలను
మమకారాపు మాధుర్యాన్ని
సంప్రదాయ విలువలను పంచే సర్వ స్వతంత్రి

నవ యవ్వన మనసుతో
నిత్య నూతన ఆలోచనలతో
నవరత్న కాంతుల నగుమోము తో
నవ వసంతంలోకి అడుగేస్తున్న
నా ఆత్మీయ నేస్తం మా అమ్మ
బుజ్జమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు💐🌹🌷

అంతర్జాలం కలిపిన బంధమే‌ అయినా
అంతరంగంలో పెనవేసుకున్న అనుబంధమై
అనునిత్యం ఆత్మీయ అక్షర సంభాషణలతో
అనురాగం పంచుతూ..అమ్మే నేస్తం అయితే
ఎలా వుంటుందో అనే నా ఆలోచనలకు
సృజనాత్మకత జోడించి
నాలో నూతన భావాలకు
అంకురార్పణ చేసిన గురువు మీరు
నా ఆలోచనా తరంగాల పౌనఃపున్యానికి
అనుసంధానం అయిన ‌ప్రత్యక్ష పరిచయం లేని
మంచి మనసున్న మనీషి మీరు
భావకవిత్వ సెలయేరై ప్రవహిస్తున్న
మీ మది పలకరింపుల‌ వర్షంలో ఆనందమై తడుస్తూ
మీ  కవితా హృదయానికి
జన్మదిన శుభాకాంక్షలు మా😍🥰 (బుజ్జమ్మ)

మీ

తాళ్ళ శ్రీకాంత్

నీవు ఉన్న చోట బాధకు చోటు లేదు..
నవ్వులకు తప్ప…
నీవు ఉన్న చోట మోయలేని బరువులు ఉండవు..
అనురాగాల జల్లులు తప్ప…
నీవు ఉన్న చోట అంధకారానికి తావు లేదు..
జిలుగుల వెలుగులు తప్ప…

ఏ జన్మ బంధమో…
నీతో ఈ పయనం.
ఏ జన్మ ఋణాను బంధమో…
నీతో ఈ తరుణం…

నీ నవ్వుల వెలుగులు ఎప్పటికి వెలుగొందాలని, మన బంధం చిరకాలం వర్ధిల్లాలని ఆశిస్తూ… లక్ష్మి
పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జమ్మ..

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బుజ్జమ్మ 💐

from

తపస్విమనోహారం టీమ్

You May Also Like

12 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు బుజ్జమ్మ

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జమ్మ గారు

  2. ఓ కవిత రాయాలని ఉంది..
    అక్షరాలు అన్నిటికీ మంచితనం అద్ది..
    ఓ కవిత రాయాలని ఉంది
    అక్షరాలు అన్నిటికీ ప్రేమ పూసి…
    ఓ కవిత రాయాలని ఉంది
    ప్రతి పదానికి ఓ చిన్న నవ్వు అంటించి…
    ఓ కవిత రాయాలని ఉంది
    ప్రతి భావానికి ఓ రూపం ఇచ్చి..
    ఓ కవిత రాయాలని ఉంది
    ప్రతి ఆలోచనలో తరిచి నిన్ను చూపిస్తూ…
    ఓ కవిత రాయాలని ఉంది
    ఓ తుంటరి అల్లరికి చిరునామా నువ్వు అంటూ…
    ఓ కవిత రాయాలని ఉంది
    స్వచ్చమైన మనసుకి ప్రతి రూపం నువ్వు అని…
    ఓ కవిత రాయాలని ఉంది
    అమాయకత్వానికి అమ్మతనం కూడా నువ్వే అంటూ…
    ఓ కవిత రాయాలని ఉంది
    సహనానికి పరీక్షవి నువ్వే అంటూ…
    ఓ కవిత రాయాలని ఉంది
    తింగరితనంలో తీపి గుర్తు నువ్వే అని…
    ఓ కవిత రాయాలి అని ఉంది
    ప్రపంచంలోని ప్రతి భాష ప్రతిలిపిలో
    నీకై ప్రేమగా ఓ కవిత రాయాలి అని ఉంది
    కానీ… అక్షరాలు ముడుచుకుని అలిగి రాను అంటున్నాయి… అంతా నీకై అర్పించేస్తే
    ఇంకా మేము మిగిలేది ఎలా అంటూ..
    అందుకే… బుజ్జమ్మ…
    నీకో కవిత నేను ఎప్పటికీ రాయను…🌹🌹
    పుట్టిన రోజు శుభాకాంక్షలు బుజ్జమ్మా…🍫🍫

  3. పుట్టిన రోజు శుభాకాంక్షలు బుజ్జమ్మ గారు.🎂🎂🎂

  4. బుజ్జమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు…

  5. Many more Happy returns of the day Bujji🍰🍰🌹🌹
    Stay blessed Dear🥰🥰🥰🥰🥰 Have all happiness in your life😊😊

  6. బుజ్జమ్మ పలకులతో ఎన్నో అద్భుతమైన రచనలు చేస్తూ అందరి కలుపుకుంటూ ముందుకు సాగుతున్న మా బుజ్జి అక్క కి
    జన్మదిన శుభకాంక్షలు…మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ. . a million wishes akka💐🥳🥁

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!