సృష్టిలో తీయని పదం అమ్మ(మా అమ్మ కృష్ణవేణి)
రచయిత::పరిమళ కళ్యాణ్
సృష్టి లో తీయని పదం అమ్మ
పెదవి పలికే తొలి మాట అమ్మ
కని పెంచే రూపం అమ్మ
కనిపించే దేవత అమ్మ
కమ్మని రాగం అమ్మ
అమితమైన ప్రేమ అమ్మ
ఎనలేని అనురాగం అమ్మ
తొలి ప్రేమ రుచి చూపేది అమ్మ
అమ్మ ఒక అద్భుతం
అమ్మ ప్రేమ అమృతం
అమ్మ మనసు వెన్న
అమ్మ మమత వెన్న
వేరేది మిన్న?
అమ్మ ప్రేమ కన్న?