నా ఋణం నువ్వు తీర్చుకోగలవా అమ్మ

నా ఋణం నువ్వు తీర్చుకోగలవా అమ్మ!!

రచయిత:: Dr. ప్రతిభ లక్ష్మీ

నా జన్మ వల్లనే కదా నువ్వు అమ్మవయ్యావు,
నా నవ్వు చూసి నువు ఎంత మురిసిపోయావు,
నా తొలి పలుకులకు ఎంతో పరవశించావు,
నాకు గోరు ముద్దలు పెట్టి నీ కడుపు నింపుకున్నావు..

నా ఋణం నువ్వు తీర్చుకోగలవా అమ్మ!!
పురిటి నొప్పులతో ధైర్యాన్ని నేర్పించాను..
అల్లరితో సతాయించి సహనాన్ని నేర్పించాను..
నీ చుట్టూ తిరుగుతూ నిస్వార్థ ప్రేమను నేర్పించాను..

నా ఋణం నువ్వు తీర్చుకోగలవా అమ్మ!!
నాకు తొలి విద్యా బుద్ధులు నేర్పడానికి పంతులమ్మవయ్యావు..
తప్పటడుగులు వేస్తే, సన్మార్గమును చూపడానికి గురువువైనావు,
అవసరాలన్ని తీర్చు సేవలెన్నో చేసి, నా కడుపు నింపుటకు వంట మనిషిగా మారావు,

నా ఋణం నువ్వు తీర్చుకోగలవా అమ్మ!!
నా అల్లరిని క్షమించి, అప్పుడప్పుడు శిక్షించి న్యాయమూర్తి వలె తీర్పిచ్చావు,
నాకు నలతగా ఉన్న రోజులలో, నీ ఒడినే తలగడ చేసి, ప్రేమగా వైద్యుడివై మందులిచ్చావు,

ఎన్ని పాత్రలు పోషించు అవకాశం ఇచ్చాను కదా..
అమ్మనయ్యాకనే తెలిసొచ్చింది నాకు ఈ విషయం,
నాకు అమ్మగా జన్మనిచ్చిన నా పిల్లలే సాక్షం..
తల్లిగా వాళ్ళ ఋణం తీర్చుకోగలనా అమ్మ!!

You May Also Like

One thought on “నా ఋణం నువ్వు తీర్చుకోగలవా అమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!