తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను చాటిన ప్రక్రియ “సున్నితాలు”
సమీక్షకులు: బూర్గు గోపికృష్ణ
తెలుగు ఆధునిక సాహిత్యంలో అధ్యయనం చేస్తున్న నూతన కవులకు ప్రక్రియ సున్నితాలు రచనలకు విశిష్టమైన స్థానం ఉంది.
తెలుగు సాహిత్య చరిత్రలో రామప్ప వైభవం గురించి తెలుగు జిలుగుల భాషను నూతన చైతన్యాన్ని నింపుతు, కావ్య రచనలో సున్నితాలు ఆవిర్భావానికి ఎంతో దోహదం చేసింది.
కవులను ప్రోత్సహిస్తూ సాహిత్యానికి ఈ ప్రక్రియను పరిచయం చేసి తన ముద్రను చాటుకున్నారు నెల్లుట్ల సునీత గారు. తెలుగు భాషా చైతన్య వ్యాప్తికి సున్నితాలు ప్రక్రియను రచనను ముందుకు తీసుకు వెళ్తున్నారు.
కాకతీయుల చరిత్ర కలిగిన రామప్ప వైభవాన్ని సున్నితాలు కవితలను ఆహ్వానించి తన సంపాదకత్వంలో, తపస్వి మనోహరం వ్యవస్థాపకులు నిమ్మగడ్డ కార్తీక్ గారు, విజయగారు, మరియు టీమ్ 2021 యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప కళా వైభవం గురించి కవులు తమ ప్రతిభా పాటవాలతో పాఠకలోకాన్ని ఆకర్షించే విధంగా సున్నితాలు ఆవిష్కరించారు. ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న కవి మిత్రులందరికీ అభినందనలు. ముందుగా సాహిత్యంలో నిరంతరం శ్రమిస్తూ నిస్వార్థ సేవలందిస్తున్న అటువంటి నెల్లుట్ల సునీత గారికి ప్రత్యేక అభినందనలు. రామప్ప వైభవం సంకలనం వెలువడ్డ సందర్భంలో అనేక సాహిత్య సమూహాలలో సమీక్షలు వ్యాసాలు అందించారు. రామప్ప శిల్పకళా వైభవాన్ని అంతటి చరిత్ర కలిగిన రచనలు రావడం చాలా గొప్ప విషయం.
♦ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి పురస్కరించుకుని సాహితీ బృందావన వేదిక మహిళా రచయితల సంఘం ఆధ్వర్యంలో కవితా పోటీలు నిర్వహించి వివిధ రంగాలలో కృషి చేసిన సాహితీ ప్రముఖులకు మణికర్ణిక జాతీయ సేవ పురస్కారాలు అందించారు, వారి కృషి మరువలేనిది.
♦ 18th అక్టోబర్ 2021 రోజున తెలంగాణ పాఠ్యపుస్తక చిత్రకారుడు గీసిన108 చిత్రాలను సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాల చిత్ర ప్రదర్శన
నిర్వహించి ప్రముఖుల ప్రశంసలు పొందారు నెల్లుట్ల సునీత. ఇలాంటి కార్యక్రమం ఎలాంటి వేదిక చేయలేదు అందుకు నిదర్శనం సాహితీ బృందావన జాతీయ వేదిక ఆదర్శం.
సాహిత్య ప్రహేళిక కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీలు నిర్వహించి నగదు ప్రోత్సాహక బహుమతులు, విశిష్ట జాతీయ సేవా పురస్కారాలు అందించిన ఘనత నెల్లుట్ల సునీతకు దక్కుతుంది.
ప్రక్రియ పరిచయం:
* “సున్నితం” ప్రక్రియ లక్షణాలు నియమాలు
* “సున్నితం సరళ శతకం”
* మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి.
* “నాలుగో పాదం” మకుటంతో వుంటుంది
* ప్రతి పాదంలో “మూడు పాదాలు” వచ్చేలా పదాన్ని పూర్తి చేయాలి.
* ఈ ప్రక్రియను మాత్ర చందస్సు ఈ పద్ధతిలో కూడా రాయవచ్చు.
* మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి.
* నాలుగో పాదం మకుటం వస్తుంది “చూడ చక్కని తెలుగు సున్నితంబు”
* ఒక పాదంలో ఒకటి నుంచి 16 వరకు ఉండాలి.
* ఒకటి నుంచి16 మాత్రలు తెలుసుకుంటే మిగతా పదాలు సున్నితాలు కూడా, సమాన మాత్రలతో రాయలసీమ ఉంటుంది.
లేదా
* ఒకటి నుంచి16 మాత్రలు ఒక పదంతో తీసుకుంటే మిగతా పాదాలు కూడా సమాన మాత్రలు 16 వచ్చేలా చూసుకోవాలి.
సున్నితం కవయిత్రి గీతా రాణి అవధానుల గారు తన సున్నితంలొ రామప్ప వైభవం గురించి శిల్పకళకు అద్దం పట్టే విధంగా చరిత్ర వారసత్వం కలిగిన కీర్తిని చాటుతూ స్పష్టంగా సున్నితాలు రచించారు.
సున్నితం కవయిత్రి కాటుకం కవిత గారు, రామప్ప దేవాలయం అనే శీర్షికతో కాకతీయుల వైభవాన్ని సాహిత్యాన్ని ఒడిసి పట్టే విధంగా సప్తస్వరాలు శిల్పకళ నేపథ్యం ప్రాముఖ్యతను పర్యాటకులను కనువిందు చేసే లాగా అద్భుతమైన సున్నితాలు అందించారు.
సున్నితం కవి భరద్వాజ గారు రామప్ప వైభవ శిల్పకళకు పెట్టింది పేరు భారతీయ కీర్తిని కొనసాగిస్తూ సాగిన ఓరుగల్లు స్ఫూర్తికి నిదర్శనం కాకతీయ సామ్రాజ్యాన్ని సున్నితాలలొ విస్తృత పరిచారు.
సున్నితం కవయిత్రి చాంద్ బేగం గారు బంగారు తెలంగాణ రాష్ట్రమంటూ కాకతీయ అద్భుత ప్రపంచ వారసత్వం
సంస్కృతి సాంప్రదాయాలను కొన్ని ఆడుతూ సున్నితాలను వ్యక్తపరిచారు.
సున్నితం కవయిత్రి అవ్వారి ఉమా బార్గవి గారు కాకతీయ వారసత్వ సంపదను వివరిస్తూ పర్యాటక క్షేత్రానికి అనువైన ప్రాంతమని సున్నితాలలొ మంచి సందేశం ఇచ్చారు.
సున్నితం కవయిత్రి దీకొండ చంద్రకళ గారు రామప్ప దేవాలయం కట్టడాన్ని సఫలీకృతం చేస్తూ చరిత్ర ఉట్టి పడే విధంగా చాలా చక్కని సున్నితాలు వివరించారు.
సున్నితం కవి తంగళ్ళపల్లి ఆనందాచారి గారు రమణీయ శిల్పకళా రాజసం కాకతీయుల ముందు చూపు నిదర్శనం జల సిరులను కురిపించే లాగా చరిత్ర ఆనవాళ్లను సున్నితాలలొ దిశానిర్దేశం చేశారు.
సున్నితం కవయిత్రి బోర ఉమాదేవి గారు రామప్ప చరిత్ర రాతి కట్టడాన్ని విశ్లేషిస్తూ రామప్ప వైభవ విశిష్టతను భవిష్యత్ తరానికి సున్నితంలో మంచి రచనలు గావించారు.
సున్నితం కవయిత్రి మెరుగు అనురాధ గారు ఇసుక పునాదిపై వెలసిన రామప్ప
వేల ఎకరాలకు నీరందించే రామప్ప చెరువు కాకతీయుల వారసత్వ వారధిని సున్నితాలలొ చరిత్రను చాటిచెప్పారు.
సమాజ ప్రగతికి దోహదపడే రచనలు సామాజిక సమానతను రామప్ప కళా వైభవాన్ని కనువిందు చేసే రచన పాఠకలోకాన్ని ఎంతో ఆకర్షించింది అందుకు నిదర్శనం రామప్ప వైభవం సంకలన నెల్లుట్ల సునీత గారి సంపాదకత్వం రావటం అభినందించదగ్గ విషయం మును ముందు మరిన్ని సంకలనాలు వెలువరించాలని ఆకాంక్షిస్తూ..
సున్నితం అక్షర అభినందనలతో
బూర్గు గోపికృష్ణ