హృద్యమైనది

హృద్యమైనది

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం. వి. ఉమాదేవి

సామూహిక జీవితం వదిలి పరాయిచోటుకి
తరలి వెళ్లే తప్పనిసరి పరిస్థితులలో వీడ్కోలు
మనసుపిండే భావనల సమావేశం హృద్యమై,అశ్రుకణమై..

ఉపాధివేటలో ఉన్నఊరినీ కన్నవారిని
ఆలు బిడ్డల్ని,సాకిన మూగజీవుల్నీ విడిచి
ఒకచిగురాశ ఉదయించే సూర్యునిగా వస్తానని!!
నేటి డాలర్ వేటలో తిరిగొచ్చేహామీ లేనివీడ్కోలు!

ఇతిహాస వీడ్కోలు సీతారామ వనవాసం,సీతా పరిత్యాగం
కన్నతండ్రి కాకున్నా కణ్వమహర్షి వీడ్కోలు శకుంతలకు
సీతాన్వేషిగా హనుమకి సముద్రలంఘనం వీడ్కోలు వానరవీరులతో
ఒక వీడ్కోలు వేవేల అభ్యుదయభావనల చేవ్రాలు!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!