మనుషులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చెరుకు శైలజ
చెప్పుడు మాటలు వినడం
మనుషులు మారడం
బంధాలను తెప్పు కోవడం
మనసుకు గాయం
మమతలు మాయం
ప్రేమలు దూరం
అయిన వాళ్ళు శత్రువులు
కాని వాళ్లు మిత్రువులు
తీయగా మాట్లాడే వాళ్ళదే రాజ్యం
వున్నది ఉన్నట్లు చెప్పే వాళ్లకు అవమానం
నోరు ఉన్న వాడిదే ఊరు
నోరు లేని వాడిది అదో తీరు
ఇదే జీవితంలో జరిగే సంఘర్షణ హోరు
ఈ మనుషులు ఇప్పటి కైన మరి
అన్ని చెడ్డ ఆలోచనలకు వీడికోలు పలకాలి
అందరితో కలిసి మెలసి సంతోషంగా వుండాలి.