సిరా

సిరా

రచన: పోలగాని.భానుతేజశ్రీ

మనసులోని భావాలను పదిలంగా కాగితముపై చేర్చుతూ
మనసిచ్చిన మగువ కోసం ప్రేమకవితలా మారుతూ
నిత్యం అక్షర జ్యోతిగా వెలుగుతూ
మనిషి జీవితానికి వారి ఆశయాలకు తొలిమెట్టు నీవై నడిపిస్తూ….

మానవ జీవిత పుస్తకాన వెలుగు దారవై ప్రవహిస్తూ
“అమ్మ” అనే అక్షరంతో మొదలయ్యి
ఎన్నో జీవితాలను నడిపిస్తూ
ప్రతి మానవ మస్తిష్కాన జ్యోతిగా ప్రజ్వలిస్తూ…

భావాల భాండాగారాన్ని బద్దలు కొట్టి అక్షర గంగవై పొంగుతూ
తెల్ల కాగితానికి అక్షరముతో చిరునామా ఇస్తూ
కలముతో మనుషుల మస్తిష్కాన్ని ఆలోచింపచేస్తూ…

జ్ఞానపీఠాన్ని గర్వింపచేస్తూ…
సిరా ప్రవాహం నిత్య వెల్లువై…
భావార్ధాలకు ప్రతీక తానై…
వెలుగులిస్తూనే ఉంటుంది జ్ఞాన దీపికలా….
**********************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!