నవ్వండి మనసారా

నవ్వండి మనసారా

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

కనిపించీ కనిపించని నవ్వులా,
నాన్న మనస్సులా స్వచ్ఛంగా,
నవ్వండి నవ్వండి మనసారా;

ముద్దుగా ముద్దైన నవ్వులా,
అమ్మ ప్రేమలా ప్రేమగా,
నవ్వండి నవ్వండి మనసారా;

బోసి పసిపాప చూసే నవ్వులా,
వన్నెల వెన్నెల కురిసెలా,
నవ్వండి నవ్వండి మనసారా;

వెగటు పుట్టని నవ్వులా,
ప్రేమికుల చిలిపితనంలా,
నవ్వండి నవ్వండి మనసారా;

అరమరికలు లేని నవ్వులా,
స్నేహితులు చేసే అల్లరిలా,
నవ్వండి నవ్వండి మనసారా;

విలనిజం లేని హీరోలా,
ఆరోగ్యంగా, ఆహ్లాదంగా,
తనివితీరా తీరికగా,
పెదవిపై పలువరుస మెరిసేలా,
మల్లె పూవులా, మందారంలా,
ఇక ఆలస్యం చేయకుండా
నవ్వుతూనే వుండండి మనసారా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!