భరతమాత మెడలో మెరిసిన ఆభరణం

భరతమాత మెడలో మెరిసిన ఆభరణం

(పుస్తక సమీక్ష)

సాహిత్యకళ అన్ని కళల్లోకి ముఖ్యమైనది సాహిత్యం పట్ల మక్కువతో దానిపై పట్టు సాధించి ఎందరో మహానుభావులు వివిధ గ్రంధాలు,పుస్తకాలు రాసి కత్తితో సాధించనిది కలంతో సాధించవచ్చని నిరూపించారు.అంతటి మహోన్నతమైన సేవ చేస్తూ సాహితీ బృందావన జాతీయ వేదిక వ్యవస్థాపకురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత గారు తన రచనలతో అలరించడమే కాక ఎంతో మంది కవులను,కవియిత్రులను ప్రోత్సహిస్తూ కొత్త ప్రక్రియలతో అలరిస్తున్నారు.. వృత్తిని గౌరవిస్తూ ప్రవృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నో అవార్డులు అందుకున్నారు అయినా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు..
సాహిత్య బృందావన జాతీయ వేదిక ద్వారా రచనలు చేయిస్తూ వారిని తగురీతిగా సత్కరించటం,బిరుదులను ప్రధానం చేయడం సునీత గారికి సాహిత్యం పట్ల ఉన్న తృష్ణ,పట్టుదలను తెలియచేస్తుంది.
నేడు ” భరతమాత రక్షణ మన బాధ్యత ” ఈ కృతిలో 74 మంది కవులు,కవయిత్రులు ఓకే అంశంపై చక్కటి రచనలు చేయగా వాటిని ఒక సంకలనంగా మార్చి ఆ భరతమాత మెడలో పూలమాలగా సమర్పించడం నిజంగా సాహితీప్రస్థానంలో ఒక మైలురాయి..
ముందుమాటగా డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు సాహిత్యరచన చేసి పేరు సంపాదించడం వ్యక్తిగత విషయం కానీ సాహిత్య రచన చేయించి సమాజాన్ని చైతన్యపరచడం చాలా కష్టతరమని వారు తమ మదిలో మాటలను వెల్లడించారు నిజంగా ఎంతగొప్పగా రాశారు..సునీత గారు చేస్తున్న యజ్ఞంలో ఎందరో పాల్గొన్నారు ప్రతిఒక్కరు అదృష్టవంతులే..
కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు కవిత్వం అంటే ఆషామాషీ కాదని,ఒక వస్తువుపై కవి తీవ్రంగా చలించి ఉద్వేగంతో ఆలోచనల్లో వడబోసిన వాక్యాలు కాగితంలోకి చేరితే అది రచన అంటూ చక్కని విశ్లేషణ చేశారు.
శతాధిక కరపత్ర రూపకర్త డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు ప్రతీ రచనను విశ్లేషిస్తూ వారి భావాలను పొందుపరుస్తూ ప్రస్తుత కాలంలో ఇలాంటి సంకలనాల ఆవశ్యకత ఎంతో ఉందని మున్ముందు ఎన్నో ప్రచురిస్తారని ఆశావాహ దృక్పథంతో అక్షరాలను తీర్చిదిద్దారు..
ముందుమాట కాదు మనలో మాట అంటూ ఎందరో మహామహులు కవిత్వాన్ని తూచేరాళ్లు అవి నా దగ్గర లేవని అనగా ఇప్పుడిప్పుడే కవిత్వ దాహార్తిని తీర్చుకుంటున్న నాకు సాధ్యమైన పనేనా? నేను లాక్షణికుణ్ణి కాను,మీ నుండి స్ఫూర్తిని పొందే సాహిత్య విద్యార్థిని అంటూ తృష్ణ గారు చక్కని చెమక్కులు విసిరారు..
ఈ కవితా సంకలనంలో ప్రతి కవిత చదువుతుంటే ఒక మిస్సైల్ గా,ఒక అగ్ని క్షిపణిగా,అణుబాంబుగా అంతకుమించి ప్రతి అక్షరం ఒక తూటాగా అనిపించిందంటూ కవి,గాయకుడు శ్రీ వాకిటి రామ్ రెడ్డి గారు తమ అరుదైన శైలిలో తెలిపారు.
సాహిత్యంలో సృజనాత్మకత ఎంత ముఖ్యమో భావ కర్తవ్యాలను నెమరువేసుకుని నూతన ఉత్సహంతో చేసినటువంటి భరతమాత రక్షణ అందరి బాధ్యతతో ముందుకు తీసుకు వెళ్లాలని అభ్యుదయ యువకవి శ్రీ బూర్గు గోపీకృష్ణ తెలిపారు.

ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే జీవితాన్ని ఎంతో త్యాగం చేయాల్సి ఉంటుంది సామజిక దృక్పథంతో సాహితీ సేవలు చేస్తున్న సునీత గారు అభినందనీయురాలు అంటూ కవయిత్రి చాంద్ బేగం గారు అభివర్ణించారు

పోటీలలో వచ్చిన కవితలన్నీ పుస్తకరూపంలో అందరికి అందించాలని సంకల్పించాను ఈ మహా యజ్ఞానికి నా భర్త పసునూటి జనార్దన్ గారు సహరించడమే కాక తను నా వెన్నంటే ఉండి ఎంతో ప్రోత్సహించారని,నాకు గురుతుల్యులు డాక్టర్ ఆచార్య కూరెళ్ల విఠలాచార్య గారింటికి వెళ్ళినప్పుడు వారు సాదరంగా ఆహ్వానించి మాకు శిరిడి సాయినాధుని సన్నిధిలో కూరెళ్ల గ్రంథాలయ ఫౌండేషన్ తరపున గౌరవ సన్మానం చేసి వారి కృతి” కాన్ఫిడెన్సియల్ రిపోర్ట్ ” మరో మూడు గ్రంధాలను అందించారు.ఆ ఆత్మీయ స్వాగతం మరువలేనిది అంటూ సునీత గారు ప్రతీ ఒక్కరికీ పేరుపేరున అభివందనాలు తెలుపుకున్నారు..

🌹ఈ సంకలనములోని కొన్ని మచ్చుతునకలు🌹

” పుడమిలో వెలసిన పుణ్యభూమి
వేదాలు వెలసిన ధర్మభూమి
ఊరూరా శాంతిబాటలు వేద్దాం
భరతమాత మన రక్షణ అని బాధ్యతగా మెలుగుదాం,వెలుగుదాం”

“పుట్టిన గడ్డ రుణం తీర్చుకో
ఎక్కడున్నా పొగుడు నీ భరతావనిని
మొక్కు ప్రపంచం మొకెట్టు చేయి”

“స్వదేశీ వస్తువులను కొందాం
విదేశీ వస్తువుల వదిలేద్దాం
అణువణువు భూమాతను కాపాడదాం”

“దేశరక్షణకై నువ్వు కంచెలా మారు
కంచుగొడయై నిలు
భరతమాత రుణం తీర్చుకునే కవచమై కదులు”

“మీ వీరత్వానికి జాతి భాష్పాంజలి
మీ అసమాన ధీరతకు నా కవితాంజలి”

ఎంతో చక్కని ముఖచిత్రంతో ఆవిష్కరించిన ఈ సంకలనం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం..
భరతమాత మెడలోన వేసిన ఆభరణం..
ఈ సంకలనానికి సమీక్ష చేసే భాగ్యం కలిగినందులకు నేను ధన్యురాల్ని..

జైహింద్🙏🙏
జైజవాన్.. జైకిసాన్..🙏

సర్వేజనా సుఖినోభావంతు..
మీ..ఉమాభార్గవి✍️

తపస్వి మనోహరం పుస్తక విభాగం రచయితల స్పెషల్ ఉప విభాగంలో ఈ పుస్తకం ఉచితంగా చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను.. సమీక్షలు రూపంలో అందించి రచయితను ప్రోత్సహిస్తారు అని ఆశిస్తున్నాము.

తపస్విమనోహరం టీమ్🙏

You May Also Like

2 thoughts on “భరతమాత మెడలో మెరిసిన ఆభరణం

  1. Chala baga రాశారు మీ సమీక్ష.. అభినందనలు మేడం. 👏👏👏

  2. చాలా మంచి కవితల పుస్తకం…. నెలుట్ల సునీత గారికి అభినందనలు..అలాగే ఉచితం గా ఈ పుస్తకం చదివే అవకాశం కల్పించిన మనోహరం టీం కి ధన్యవాదాలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!