తెలంగాణ తొలిపొద్దు కాళోజి

తెలంగాణ తొలిపొద్దు కాళోజి

బూర్గు. గోపికృష్ణ
7995892410

తెలంగాణ ప్రజల
ఉద్యమ ప్రతిధ్వని
తెలంగాణ ప్రజాకవి
అక్షరమే ఆయుధంగా
ఎక్కుపెట్టిన కదనకవి

నిజాం రజాకార్లను
తరిమిన చైతన్యశీలి
తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి
ప్రజాకవి… కాళోజి

తెలంగాణ ప్రజలఆర్తి
తెలంగాణ యాసవెలుగు
పలుకుబడుల తెలుగు
బాషాకల్పతరువు కాళోజి

గ్రంధాలయ ఉద్యమకీర్తి
తెలంగాణ ప్రజాగొంతుక
తెలంగాణ పీడిత జనజాగృతి
ప్రజాకవి…… కాళోజీ

ప్రజలగొడవనే
నా గొడవ గా తలచి
అక్షరసిరా చుక్కతో
లక్షల మెదళ్ళలో
ఉద్యమ జ్యోతులు
వెలిగించిన అక్షరదీప్తి కాళోజీకి
నా అక్షర నివాళి

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!