మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: గేరపాటి భాను వర్ధన్
ఊరు::ఫిరంగిపురం

తరలిరా తరులు నాటగా
తరులే భువికి పచ్చతోరణం
తరులతోనే నిత్య సంతోషం
చూడచక్కని తెలుగు సున్నితంబు!

సంవృద్ధి వర్షాలు కురవాలని
మేఘనాధుని ప్రసన్నుడను చేయ
వృక్షరాజు నింగికి ఎగెసే
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్కను నాటి మ్రొక్కు
నీకు నీడై నిలుస్తుంది
ఇంటి ప్రాంగణాన్ని చల్లబరుస్తుంది
చూడచక్కని తెలుగు సున్నితంబు

భూతాపం చల్లార్చేవి మొక్కలు
ప్రాణవాయువు అందించేవి మొక్కలు
ప్రగతికి మెట్లు మొక్కలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్కలతో సతతం హరితం
అందరి జీవితాలు ఆనందభరితం
నాటు నేస్తమా మొక్కలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!