మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితంబు
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: కవిత వేంకటేశ్వర్లు
ఊరు::కర్నూలు

జనజీవన స్రవంతిలో మొక్కలు
అందిస్తాయి ఎన్నో ఉపయోగాలు
మొక్కకు నీరుపోసి పెంచితేచాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

చల్లని నీడనిచ్చి ఆదుకొనును
చల్లని గాలినిచ్చి సేదతీర్చును
చెట్టుకిందికి చేరితేనే హయిగుండును
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

మొక్కచక్కగా పెరిగి మానౌను
మానుతోపాటు కాయలు పండ్లవును
ఆపండ్లు మనుషులఆకలి తీర్చును
చూడచక్కని తేలుగు సున్నితంబు!!

వంట చేరుకుగా వినియోగించవచ్చును
ఇండ్లకు దూలాలుగా పనికివచ్చును
ఆకులలములు ఔషదానికి వాడవచ్చును
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

బొగ్గుపులుసు తీసుకొని ఆక్సిజన్అందించును
మనుషులను మృత్యువాత
నుండితప్పించును
కాటికివచ్చి పార్థివశరీరాన్ని
దివికిపంపును
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!