మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం తెలుగు
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: ఖలీమ్ పాషా
ఊరు::మడికొండ, ఖాజీపేట, వరంగల్ అర్బన్

రేపటి ఊపిరికి జీవంపోయ్యి
తరువులను చూడకు బరువుగా
ముప్పు తీసుకురాకు మనుగడకు
చూడచక్కని తెలుగు సున్నితంబు

నవ నాగరికతను మార్చు
అవనికి అందాన్ని చేర్చు
అందరికీ వాయువును పంచేట్టు
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్కలు పంటలై పండవా!
చెట్లు వనాలై విస్తరించవా!
ప్రకృతి పరమార్ధం పరోపకారమేగా!
చూడచక్కని తెలుగు సున్నితంబు

చెట్లను బలిచేసి భవనాలు
ఫ్యాక్టరీల వెచ్చని గాలులు
భూతాపం మరో అగ్నిగోళం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కాలుష్యం కోరలలో ఆయుస్సు
తరిగెనే మానవుని ఉషస్సు
చంపకు భావిపౌరుల మనస్సు
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

One thought on “మొక్కలు నాటు సంరక్షించు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!