నా నువ్వు

అందరితో గోదావరిలా గంభీరంగా ఉండే నేను …

నిను చేరగానే ఉరకలు వేసే పిల్లకాలువనైపోతాను …

అందరికి తల్లిలా సేవలు చేసే నేను …

నీ చేతి గోరుముద్దలు తినాలని తహతహలాడుతుంటాను …

అందరినీ అజమాయిషీ చేయగల నేను …

నీ అడుగులో అడుగువేయాలని ఆరాటపడుతుంటాను…

ఎందుకో… నీ అధర స్పర్శ …

నా నుదుటిన చేరగా… పరవశించే తనువు …

నా చుబుకాన్ని చేరగా…. వికసించే అధరం …

నా నయనాన్ని చేరగా… వర్షించే నయనం …

నా అధరాన్ని చేరగా… హర్షించే హృదయం …

నా హృదయాన్ని చేరగా… పురి విప్పే తమకం …

నా నాభిని చేరగా… ఎగసేను విరహం …

నా పాదాలను చేరగా… రగిలేను మోహం …

నా అణువణువూ చేరగా…

అయ్యేను నీలో సగం …

శాంతి

You May Also Like

2 thoughts on “నా నువ్వు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!