మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: గీతారాణి అవధానుల (మయూఖ)

పర్యావరణ పరిరక్షణ చేద్దాం..
జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం..
వీలైనన్ని మొక్కలు నాటుదాం..
చూడచక్కని తెలుగు సున్నితంబు..

మొక్కలు నాటుదాం అందరం..
నాటిన వాటిని పరిరక్షించుదాం..
మొక్కలు రక్షిస్తేనే జీవనం..
చూడచక్కని తెలుగు సున్నితంబు..

తరువులు త్యాగానికి గురువులు..
ఇచ్చును మనకెన్నో ఆధరువులు..
తీర్చును ఇలలో కరువులు..
చూడచక్కని తెలుగు సున్నితంబు..

జనాలు రక్షిస్తే వనాలను..
వనాలు రక్షించును జనాలను
అదేగా ప్రకృతి ధర్మం..
చూడచక్కని తెలుగు సున్నితంబు..

వనాలతోనే కురియును వర్షం..
వానలతోనే రైతుకు హర్షం..
పంటలతోనే జగతికి హర్షం..
చూడచక్కని తెలుగు సున్నితంబు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!