ఒక రూపం ఉనికిని ఇచ్చిన భగవంతుడు

(కవితాంశం : ప్రపంచ పితృ దినోత్సవం సందర్భం గా
అంశం : ప్రేమతో నాన్నకు)

 ఒక రూపం ఉనికిని ఇచ్చినభగవంతుడు

రచన : నల్ల.కరుణశ్రీ

నాన్న ఒక అద్భుతం, మన జన్మకు కారణమై మనకు ఒక రూపం ఇచ్చి ఈ సృష్టి లోకి తెచ్చిన దేవుడు….
ఈ సృష్టిలో మనం దినదిన ప్రవర్థ మానంగా ఎదగడానికి, సమాజం లో
మనకొక స్థాన మిచ్చిన ప్రేమ మూర్తి.
“నాన్న” ఒక అద్భుతమైన బంధం
మన ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తూ తన జీవితమే మనముగా భావించే నాన్న.
రక్తము ముద్దని రోజు రోజు కీ పున్నమి చంద్రుడి లా ఎదుగుతూ, ముద్దు ముద్దు మాటలు నేర్పిస్తూ, చిట్టి చిట్టి అడుగులు వేపిస్తూ, అవి అన్నీ చూస్తూ ముచ్చట పెడుతూ, ఆనందంగా ఈ లోకంతో ఒక బంధం ఏర్పరచే నాన్న.
నాన్నతో ముడిపడిన ఈ ఊపిరి, గతం వర్తమానం, భవిష్యత్తు అన్నీ నాన్నే.
మొదటి భుజ స్పర్శ ని తెలిపిన నాన్న ఈ ప్రపంచం ఎలా ఉంటుందో
మనమెలా నడుచుకోవాలో అడుగడుగునా తెలిపే నాన్న మనకు దేవుడిచ్చిన వరమే కదా..
మనల్ని చదువుల సరస్వతికి అప్పచెప్తూ జీవితంలో ఎంతో ఎత్తు కు ఎదగాలని నలుగురికి ఆదర్శం అవుతూ, నలుగురికి సహాయం చేస్తూ బ్రతకాలని కోరుకుంటూ సమాజం లో ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ, ఎదిగిన మనల్ని చూసి ఆనందంతో తలములకలయ్యే నాన్న మన జీవితానికి ఒక వెలుగు కిరణం 🙏
మన కాళ్ళమీద మనం నిలబడి, తల ఎత్తుకొని బతుకుతూ, ఎల్లవేళలా తోటి వారికి ఉపయోగపడుతూ ,మనకు అందుబాటులో ఉన్న సాయం చేస్తూ మనకోసం మనం బ్రతకాలంటూతల ఎత్తుకుని గర్వంగాబ్రతుకుతూ, తోటి వారికి ఉపయోగపడుతూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక మనిషిగా బతకమని ఎప్పుడూ మన వెనకా ముందు వెన్నుదన్నై
నిలిచే నాన్న మనకు దేవుడిచ్చిన వరం 🙏.
నాన్న కు మానసికం గా , శారీరకం గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సంతోషం తో ఆయురారోగ్యాల తో
నిండు నూరళ్లూ జీవించి మనకు తోడు నీడగా ఉండాలని కోరుకుంటూ🙏🙏🙏🙏🙏😍
ఫ్రమ్ : సృష్టికి మూలమైన నాన్నకు ప్రేమతో…..
❤️ మీ.. పిల్లలు… ఐ ❤️🙏🙏

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!