(ఆరోగ్య దినోత్సవ సందర్భంగా)
ఇడ్లీ
రచయిత :: జె వి కుమార్ చేపూరి
దక్షిణ భారత అభిమాన అల్పాహారం ఇడ్లీ
ఆరోగ్యానికెంతో మేలుచేయును గ్రేట్లీ
తక్షణ శక్తినిచ్చును ఇన్స్టంట్లీ
ఆరోగ్యానికి డోఖా లేదు మోస్ట్లీ
నేడు దేశమంతా ప్రఖ్యాతి ఈ ఇడ్లీ
ప్రపంచమంతా ప్రాకింది స్మూత్లీ
నూనెతో పని లేని అల్పాహారం
ఇట్టే తయారుకాగల ప్రియాహారం
నోటిలో వేసుకుంటే కరిగిపోవులే ఇడ్లీ
సాంబారుతో కలిపి తింటారు మైమరచి
కొబ్బరిపల్లీ చట్నీతో నోరూరించే ఇడ్లీ
పొడి, నేతితో కలిపి తింటే కమ్మని రుచి
రవ్వ, మినుముల కమ్మని కలయిక ఇడ్లీ
దూది పింజెలా నున్నని, తెల్లని ఆకృతి
ఆవిరిపైన ఉడికించిన అల్పాహారం ఇడ్లీ
ఆట్టే నచుతుంది ఎవరికైనా ష్యూర్లీ
తింటే కమ్మని ఇడ్లీ ఉదయం
పొట్టలో గడబిడ దూరం
గొంతులో మంటలు మాయం
కడుపులో చల్లదనం ఖాయం
—- ** —- ** —-