మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: తంగెళ్ళపల్లి ఆనందాచారి
ఊరు::హన్మకొండ,వరంగల్ అర్బన్

నింగి నేలవైపు వంగింది
మేఘం నీటితో నిండింది
తొలకరి చినుకు రాలింది
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఎండకు నెర్రెలిచ్చిన నేల
తొలకరి చినుకు రాలినవేళ
సంతరించుకునె కొత్త కళ
చూడచక్కని తెలుగు సున్నితంబు

నానిన నేలను తవ్వుదాం
విత్తులు ఎన్నో విత్తుదాం
పచ్చని మెక్కల నాటుదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

పర్యావరణ పరిరక్షణ చేద్దాం
ప్రకృతిని రక్షించ పూనుదాం
భవితకు బాటలు వేద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

జరిగిన తప్పును సరిదిద్దుదాం
మొక్కలు నాటి పెంచుదాం
భావితరానికి సంరక్షణ బాధ్యతనిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!